పరిపాలన విషయాలు గోప్యంగా ఉంచండి
ABN , Publish Date - Mar 05 , 2025 | 12:43 AM
పరిపాలన, ఆఫీసు విషయాల్లో మినిస్ర్టీరియల్ సిబ్బంది గోప్యత పాటించాలని కర్నూలు జీజీహెచ సూపరింటెండెంట్ కె.వెంకటేశ్వర్లు ఆదేశించారు.

మధ్యాహ్న భోజనానికి అరగంట కేటాయింపు
జీజీహెచ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు
కర్నూలు హాస్పిటల్, మార్చి 4(ఆంధ్రజ్యోతి): పరిపాలన, ఆఫీసు విషయాల్లో మినిస్ర్టీరియల్ సిబ్బంది గోప్యత పాటించాలని కర్నూలు జీజీహెచ సూపరింటెండెంట్ కె.వెంకటేశ్వర్లు ఆదేశించారు. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ధన్వంతరీ హాలులో మినీస్టీరియల్ సిబ్బం దితో ఆయన సమీక్ష నిర్వహించారు. మధ్యాహ్న భోజనం సమయంలో చాలా మంది సిబ్బంది ఎక్కువ సమయం తీసుకుంటున్నారని, మధ్యా హ్నం ఒకటి నుంచి 3 గంటలలోపు అరగంట మాత్రమే భోజనానికి వెళ్లాలని ఆదేశించారు. కార్యాలయంలో సీట్లు మార్పిడి చేయాలని కొం దరు ఉద్యోగులు సూపరింటెండెంట్ దృష్టికి తీసుకెళ్లారు. పరిపాలనను దృష్టిలో పెట్టుకుని సీట్లను మారుస్తామని ఏ సీట్లలో ఎవరూ ఉండాలో తాము నిర్ణయం తీసుకుంటామని ఆయన వివరించారు. నాలుగో తర గతి సిబ్బంది అటెండెన్స, డ్రస్ కోడ్, ఐడీ తప్పనిసరిగా ఉండాలన్నారు. సమీక్షలో డిప్యూటీ సూపరింటెండెంట్ డి.శ్రీరాములు, అడ్మినిస్ర్టేటర్ సిందు సుబ్రహ్మణ్యం, ఆసుపత్రి ఏడీ వై.మల్లేశ్వరమ్మ, ఏవో శ్రీనివా సు లు, ఆఫీసు సూపరింటెండెంట్లు శ్రీనివాసులు, లతీఫ్ బేగ్, పాల్గొన్నారు.