శాస్త్రోక్తంగా కామ దహనం
ABN , Publish Date - Mar 13 , 2025 | 12:49 AM
శ్రీశైలం క్షేత్రంలో ఫాల్గుణ శుద్ధ చతుర్థశిని పురస్కరించుకుని బుధవారం సాయంత్రం 6.30 గంటలకు కామదహన కార్యక్రమాన్ని దేవస్థానం శాస్త్రోక్తంగా నిర్వహించింది.

శ్రీశైలం, మార్చి 12(ఆంధ్రజ్యోతి): శ్రీశైలం క్షేత్రంలో ఫాల్గుణ శుద్ధ చతుర్థశిని పురస్కరించుకుని బుధవారం సాయంత్రం 6.30 గంటలకు కామదహన కార్యక్రమాన్ని దేవస్థానం శాస్త్రోక్తంగా నిర్వహించింది. ప్రధానాలయం ముందు భాగంలోని గంగాధర మండపం వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముందుగా ఆలయంలో స్వామి, అమ్మ వార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పల్లకీ సేవ నిర్వహించారు. పల్లకీసేవలో భాగంగా ఉత్సవమూర్తులను గంగాధర మండపం వద్దకు తీసుకొచ్చి శాస్త్రోక్తంగా పూజలు జరిపారు. తరువాత మన్మఽథ రూపాన్ని దహనం చేశారు. ఆలయ ఈవో ఎం. శ్రీనివాసరావు, శ్రీస్వామివార్ల ప్రధానార్చకులు కె. శివప్రసాద్ స్వామి, అధ్యాపక ఎం. పూర్ణానందఆరాధ్యులు, ప్రజాసంబంధాల అధికారి టి. శ్రీనివాసరావు, పర్యవేక్షకులు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు. కామదహనం భధ్రతా ఏర్పాట్లను స్థానిక సీఐ ప్రసాదరావు, దేవస్థానం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ కె. అయ్యన్న పర్యవేక్షించారు.