క్రీడలతో ఉద్యోగావకాశాలు
ABN , Publish Date - Feb 01 , 2025 | 11:12 PM
క్రీడలతో ఉద్యోగావకాశాలు ఉన్నాయని, విద్యార్థుల్లో మానసిక స్థయిర్యం వస్తుందని కలెక్టర్ రంజిత్ బాషా, ఎమ్మెల్యే శ్యాంబాబు అన్నారు. శనివారం పత్తికొండలో కేఈ మాదన్న స్మారక సౌత్‌జోన్ ప్రీమియర్‌లీగ్ టీ-20 క్రికెట్ పోటీలు ప్రారంభమయ్యాయి
కలెక్టర్ రంజిత్ బాషా, ఎమ్మెల్యే శ్యాంబాబు
ప్రారంభమైన ప్రీమియర్ లీగ్ టి-20 క్రికెట్
పత్తికొండ, ఫిబ్రవరి 1(ఆంధ్రజ్యోతి): క్రీడలతో ఉద్యోగావకాశాలు ఉన్నాయని, విద్యార్థుల్లో మానసిక స్థయిర్యం వస్తుందని కలెక్టర్ రంజిత్ బాషా, ఎమ్మెల్యే శ్యాంబాబు అన్నారు. శనివారం పత్తికొండలో కేఈ మాదన్న స్మారక సౌత్‌జోన్ ప్రీమియర్‌లీగ్ టీ-20 క్రికెట్ పోటీలు ప్రారంభమయ్యాయి. కలెక్టర్ రంజిత్ బాషా, ఎమ్మెల్యే శ్యాంబాబు జ్యోతి ప్రజ్వలన చేశారు. ఎమ్మెల్యే బౌలింగ్ చేయగా కలెక్టర్ బ్యాంటిం గ్ చేసి పోటీలను ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ వెనుకబడిన పత్తికొండ ప్రాంతంలో సౌత్‌జోన్ స్థాయి క్రికెట్ పోటీల నిర్వహణ అబినందనీయమని నిర్వాహకులు సుంకన్న, శ్రీనివాసులు గౌడ్‌ను అబినందించారు. ఎమ్మెల్సీ బీటీనాయుడు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి, అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ చల్లాకళ్యాణి, ఆర్డీవో భరత్‌నాయక్, నాయకులు సాంబశివారెడ్డి, బత్తినవెంకట్రాముడు, తుగ్గలి నాగేంద్ర, మనోహర్‌చౌదరి, తిమ్మయ్యచౌదరి, రామానాయుడు, తిరుపాలు, దివాకర్‌రెడ్డి, కేఈ రుద్ర, ఫిరోజ్, బత్తిని లోక్‌నాఽథ్ పాల్గొన్నారు.
మొదటిరోజు కర్నూలు, పత్తికొండ-5 టీంలు తలపడ్డాయి. కలెక్టర్ టాస్ వేయగా కర్నూలు టీం టాస్‌గెలిచి ఫీల్డింగ్ తీసుకుంది. పత్తికొండ-5 టీం 74పరుగులకు ఆలౌట్ అయ్యింది. తర్వాత బ్యాటింగ్ చేసిన కర్నూలు టీం 10 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది.
క్రీడాంధ్రప్రదేశ్‌గా మారుస్తాం: శాప్ చైర్మన్ రవి నాయుడు
సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్‌గా మారుస్తామని శాప్ చైర్మన్ రవినాయుడు అన్నారు. పత్తికొండలో ఎమ్మెల్యే శ్యాంబాబు నేతృత్వంలో శనివారం సౌత్‌ఇండియా ప్రీమియర్ లీగ్ - 20 క్రికెట్ ప్రారంభోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. క్రీడలతో శారీరక ధృఽడత్వంలోపాటు మానసిక వికాసం ఏర్పడుతుందని, క్రీడా సర్టిఫికెట్లతో ఉద్యోగ అవకాశాలు ఉంటాయన్నారు. 2003లో ఉమ్మడి ఏపీ సీఎం చంద్రబాబు హైదరాబాద్ గచ్చిబౌలిలో ప్రపంచ క్రీడలను నిర్వహించారన్నారు. పత్తికొండ క్రీడామైదానం అబివృద్ధి చేయాలని ఎమ్మెల్యే శ్యాంబాబు విజ్ఞప్తి మేరకు నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.