జగన్ భవిష్యత్తులో ఎమ్మెల్యే కూడా కాలేడు
ABN , Publish Date - Feb 26 , 2025 | 12:08 AM
జగన్‌రెడ్డి భవిష్యత్తులో ముఖ్యమంత్రి కాదు కదా ఎమ్మెల్యే కూడా కాలేడని రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా షేక్ ముస్తాక్ అహమ్మద్ జోస్యం చెప్పారు.

మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా షేక్ ముస్తాక్ అహమ్మద్
నంద్యాల రూరల్ ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): జగన్‌రెడ్డి భవిష్యత్తులో ముఖ్యమంత్రి కాదు కదా ఎమ్మెల్యే కూడా కాలేడని రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా షేక్ ముస్తాక్ అహమ్మద్ జోస్యం చెప్పారు. మంగళవారం పట్టణ శివారుల్లో ఉన్న హారుణ్ ఫంక్షన్ హాల్‌లో మౌలానా షేక్ ముస్తాక్ అహమ్మద్‌ను మౌజాంలు, ఇమాంలు, మత పెద్దలు సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లింలందరు టీడీపీకి అండగా ఉంటారన్నారు. రాష్ట్ర ఆర్థిక స్థితి క్లిష్టంగా ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిధులు మంజూరు చేయటం హర్షణీయమన్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో ఏ ఒక్క మసీదుకు, ఇమాంలు, మౌజాంలకు ఒక్క పైసా ఇచ్చిన దాఖలాలు లేవని విమర్శించారు. ఇచ్చిన మాట ప్రకారం రాష్ర్టాన్ని అభివృద్ధి చేయటం నారా చంద్రబాబు నాయుడు, లోకేష్‌లకే సాఽధ్యమని స్పష్టం చేశారు. సమావేశంలో మత పెద్దలు, రాష్ట్ర మైనారిటీ నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.