Share News

సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి: కలెక్టర్‌

ABN , Publish Date - Feb 24 , 2025 | 11:59 PM

సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్‌ రాజకుమారి అన్నారు. నంద్యాలలో నిర్వహించిన సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి కలెక్టర్‌ సున్నిపెంటలోని తహసీల్దార్‌ కార్యాలయం నుంచి వర్చువల్‌గా హాజరయ్యారు.

సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి: కలెక్టర్‌
మాట్లాడుతున్న కలెక్టర్‌ రాజకుమారి

సున్నిపెంట 24(ఆంధ్రజ్యోతి): సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్‌ రాజకుమారి అన్నారు. నంద్యాలలో నిర్వహించిన సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి కలెక్టర్‌ సున్నిపెంటలోని తహసీల్దార్‌ కార్యాలయం నుంచి వర్చువల్‌గా హాజరయ్యారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఎంఎస్‌ఎంఈ, మిస్సింగ్‌ హౌస్‌ హోల్డర్స్‌ డేటాను సేకరించి వేగవంతంగా పరిష్కరించాలన్నారు. అధికారులు ప్రతి దరఖాస్తును పరిశీలించి సంబంధించిన లాగిన్‌లో అమోదించాలని, సీఎంవో, ఉప ముఖ్యమంత్రి, ఇతర ప్రముఖల నుంచి వచ్చిన అర్జీలను అధికారులు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.

నంద్యాల నూనెపల్లె: సమస్యల పరిష్కారంలో అధికారులు అలసత్వం వహించవద్దని డీఆర్వో రామునాయక్‌ ఆదేశించారు. సోమవారం నంద్యాల కలెక్టరేట్‌ ఆవరణలోని పీజీఆర్‌ఎస్‌ హాల్‌లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. డీఆర్వో హాజరై వినతులు స్వీకరించారు. 168 దరఖాస్తులు వచ్చినట్లు డీఆర్వో తెలిపారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు సంబంధిత శాఖల జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.

Updated Date - Feb 24 , 2025 | 11:59 PM