మెమోలు జారీ చేయండి
ABN , Publish Date - Feb 17 , 2025 | 11:24 PM
ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన ప్రతి ఫిర్యాదుల పరిష్కారానికి ను ఆయా శాఖల అధికారులు చేసిన ఆడిట్‌లో నాణ్యత లోపిస్తే వెంటనే వారికి మెమోలు జారీ చేయాలని కలెక్టర్ పి. రంజిత్ బాషా ఆదేశించారు.

ప్రజా సమస్యలు తక్షణమే పరిష్కరించాలి
లేదంటే చర్యలు: కలెక్టర్
కర్నూలు కలెక్టరేట్, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన ప్రతి ఫిర్యాదుల పరిష్కారానికి ను ఆయా శాఖల అధికారులు చేసిన ఆడిట్‌లో నాణ్యత లోపిస్తే వెంటనే వారికి మెమోలు జారీ చేయాలని కలెక్టర్ పి. రంజిత్ బాషా ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కారవేదిక కార్యక్రమం ద్వారా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల నుంచి సోమవారం నిర్వహించే పీజీఆర్‌ఎస్, సీఎంవో, మంత్రులు ప్రజా ప్రతినిధులు, ప్రజావేదిక, ఆన్‌లైన్ తదితర సోర్సుల నుంచి అర్జీలు వస్తున్నాయని, వీటిని నాణ్యతతో పరిష్కరించాలని అన్నారు. లేకపోతే చర్యలు తీసుకోవడంలో భాగంగా మెమోలు జారీ చేయాలని ఆదేశించారు. సీఎం కార్యాలయం నుంచి వచ్చిన అర్జీలు 65, అత్యధికంగా సబ్ కలెక్టర్ ఆదోనికి 20, పత్తికొండ ఆర్డీవోకు 16, కర్నూలు ఆర్డీవోకు 14, సర్వేకు సంబంధించి 2 పెండింగ్‌లో ఉన్నాయన్నారు.
415 అర్జీలు రీ ఓపెన్: జాయింట్ కలెక్టర్ డా.బి. నవ్య మాట్లాడుతూ రీసర్వే గ్రామ సభల్లో రీ సర్వే గ్రామ సభల దరఖాస్తులకు 415 రీ ఓపెన్ ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ప్రతి ఫిర్యాదును ఆడిట్ చేయాలని, ప్రతి పిటీషనర్‌కు ఫోన్ చేసి ఫీల్డ్‌కు వచ్చారా, నోటీసులు ఇచ్చారా? కనుక్కోవాలన్నారు. సరిగ్గా పరిష్కరించకపోతే మెమోలు జారీ చేయాలని సబ్ కలెక్టర్, ఆర్డీవోలను ఆదేశించారు. కర్నూలు ఆర్డీవో 144, పత్తికొండ ఆర్డీవో 93, ఆదోని సబ్ కలెక్టర్ 19 మెమోలు జారీ చేయాల్సి వుందని, వెంటనే మెమోలు జారీ చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కళ్యాణి, డీఆర్వో సి. వెంకటనారాయణమ్మ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బీకే వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.