నేడు ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభం
ABN , Publish Date - Feb 10 , 2025 | 12:23 AM
ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. సీసీ కెమెరాల నిఘాతో నిర్వహించేందుకు విద్యాశాఖ అధికారులు సన్నద్ధమయ్యారు.

సీసీ కెమెరాల నిఘా మధ్య నిర్వహణ
నంద్యాల ఎడ్యుకేషన్, ఫిబ్రవరి 9(ఆంధ్రజ్యోతి): ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. సీసీ కెమెరాల నిఘాతో నిర్వహించేందుకు విద్యాశాఖ అధికారులు సన్నద్ధమయ్యారు. ఈ నెల 10వ తేదీ నుంచి 20వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించేందుకు ఆయా సెంటర్లను సన్నద్ధం చేశారు. ప్రభుత్వం పాత పద్ధతిలోనే పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. నంద్యాల జిల్లాలో 35 సెంటర్లలో మొత్తం ఎనిమిది వేల మంది విద్యార్థులు ఉన్నారు. వీరిలో ఎంపీసీ 5000 మంది, బైపీసీ మూడు మంది విద్యార్థులు పరీక్షల్లో పాల్గొననున్నారు. వెబ్‌కాస్టింగ్ విధానంలో అధికారులు పరీక్షలను పర్యవేక్షించనున్నారు.
ఎగ్జామినర్లకు మూడు రోజులు మాత్రమే విధులు
35 సెంటర్లను నియమించనున్న ఎగ్జామినర్లు ఆయా సెంటర్‌లలో మూడు రోజులు మాత్రమే విధులు నిర్వహించనున్నారు. ఆ తర్వాత మరో ఎగ్జామినర్‌ను నియమించనున్నారు. ఉదయం 9గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. మాస్
కాపీ యింగ్‌కు పాల్పడితే చర్యలు
ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ పాల్పడితే చర్యలు తప్పవు. నిర్ణీత సమయంలోపే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి. ఎగ్జామినర్, పర్యవేక్ష ణాధికారులు మినహా ఏ ఒక్కరికీ సెంటర్‌లలో కి అనుమతి ఉండదు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు. అలాగే విద్యార్థులకు ఎలాంటి అసౌక ర్యం కల్పించినా కేంద్రాలను రద్దు చేస్తాం. ఎగ్జామినర్ లను ఇంటర్‌బోర్డు నిర్ణయిస్తుంది.
- సునీత, డీఐఈవో, నంద్యాల జిల్లా