Share News

వాటర్‌షెడ్‌ పనుల పరిశీలన

ABN , Publish Date - Jun 19 , 2025 | 12:00 AM

మండలంలోని గని గ్రామంలో నాబార్డ్‌, జేఎస్‌డబ్ల్యూ కంపెనీ ఆర్థిక సహకారంతో చేసిన వాటర్‌షెడ్‌ పనులను నాబార్డ్‌ డీడీఎం కార్తీక్‌ పరిశీలించారు.

వాటర్‌షెడ్‌ పనుల పరిశీలన
వివరాలను పరిశీలిస్తున్న నాబార్డు అధికారులు

గడివేముల, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి): మండలంలోని గని గ్రామంలో నాబార్డ్‌, జేఎస్‌డబ్ల్యూ కంపెనీ ఆర్థిక సహకారంతో చేసిన వాటర్‌షెడ్‌ పనులను నాబార్డ్‌ డీడీఎం కార్తీక్‌ పరిశీలించారు. అనంతరం కమిటీ సభ్యులు, రైతులతో సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ వాటర్‌షెడ్‌ ద్వార భూగర్భజలాలు పెరుగుతాయని అన్నారు. భూ సంరక్షణ పనులు చేపట్టడం వల్ల భూమి కోతను నివారించవచ్చని అన్నారు. నవ యువత అసోసియేషన్‌ డైరెక్టర్‌ నరసింహులు, ప్రాజెక్టు మేనేజర్‌ లక్ష్మీనారాయణ, ఇంజనీర్‌ హరిబాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 19 , 2025 | 12:00 AM