నీట మునిగిన పంటల పరిశీలన
ABN , Publish Date - Aug 21 , 2025 | 01:24 AM
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మల్యాల, శాతనకోట, అల్లూరు గ్రామాలలో నీట మునిగిన పంటలను ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త అరుణ్‌కుమార్, రాఘవేంద్ర బృందం, నంది కొట్కూరు వ్యవసాయ సంచాలకుడు గిరీష్, ఏవో షేక్షావలి బుధవారం పరిశీలించారు.
నందికొట్కూరు రూరల్, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మల్యాల, శాతనకోట, అల్లూరు గ్రామాలలో నీట మునిగిన పంటలను ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త అరుణ్‌కుమార్, రాఘవేంద్ర బృందం, నంది కొట్కూరు వ్యవసాయ సంచాలకుడు గిరీష్, ఏవో షేక్షావలి బుధవారం పరిశీలించారు. నీట మునిగిన పంటలను రైతన్నలు ఎలా కాపాడు కోవాలో సూచనలు చేశారు. కార్యక్రమంలో రైతులు, గ్రామ రైతు సేవాకేంద్రం సిబ్బంది పాల్గొన్నారు.