Share News

వైద్యశాలకు స్థలాన్ని పరిశీలించిన జేసీ

ABN , Publish Date - Mar 07 , 2025 | 12:01 AM

మండలంలోని తెర్నేకల్‌ గ్రామంలో ప్రాథమిక వైద్యశాలకు కేటాయించిన వివాదంగా మారిన స్థలాన్ని జాయింట్‌ కలెక్టర్‌ బి.నవ్య పరిశీలించారు.

వైద్యశాలకు స్థలాన్ని పరిశీలించిన జేసీ
రికార్డులను పరిశీలిస్తున్న జేసీ నవ్య, ఆర్డీవో భరత్‌ నాయక్‌

దేవనకొండ, మార్పి 6 (ఆంధ్రజ్యోతి): మండలంలోని తెర్నేకల్‌ గ్రామంలో ప్రాథమిక వైద్యశాలకు కేటాయించిన వివాదంగా మారిన స్థలాన్ని జాయింట్‌ కలెక్టర్‌ బి.నవ్య పరిశీలించారు. గతంలో గ్రామకంఠం సర్వే నెం.46-1లో 1.50 ఎకరాలు చూపగా వైద్యశాల నిర్మాణానికి అనువుగా లేదని, జడ్పీ పాఠశాల సమీపంలోని జగనన్న కాలనీలో సర్వే నెం. 313లో 1.10 ఎకరాలు అనువుగా ఉంటుందని గ్రామస్తులు అభ్యంతరం తెలిపారు. దీంతో జేసీ, పత్తికొండ ఆర్డీవో భరత్‌నాయక్‌ గురువారం గ్రామంలో పర్యటించి, గ్రామస్తులు సుచించిన రెండు చోట్ల స్థలాన్ని పరిశీలించారు. రవాణా సౌకర్యం, ప్రజలకు అనువుగా వున్న జెడ్పీ పాఠశాల సమీపంలో ఆపుపత్రిని నిర్మించాలని గ్రామస్థులు కోరారు. గతంలో పట్టాలు పొందిన ముగ్గురు వ్యక్తులు కోర్టుని ఆశ్రయించడంతో వారితో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని జేసీ తహసీల్దార్‌ ప్రసాద్‌ రాజుకు సూచించారు. డీటీ సుదర్శనం, పంచాయతీ కార్యదర్శి రాముడు, వీఆర్వోలు హనుమన్న, షఫీ, సర్పంచ్‌ అరుణ్‌ కుమార్‌, గ్రామస్థులు ఉన్నారు.

Updated Date - Mar 07 , 2025 | 12:01 AM