Share News

హోరెత్తిన హోసూరు

ABN , Publish Date - Feb 08 , 2025 | 12:04 AM

పత్తికొండ మండలంలోని హోసూరు గ్రామం వీరభద్రస్వామి నామస్మరణతో మార్మోగింది. వేలాదిగా తరలివచ్చిన భక్తులతో గ్రామం కిక్కిరిసింది.

హోరెత్తిన హోసూరు
అశేష జనవాహిని నడుమ సాగుతున్న రథోత్సవం

ఘనంగా వీరభద్రేశ్వర స్వామి రథోత్సవం

పత్తికొండ, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): పత్తికొండ మండలంలోని హోసూరు గ్రామం వీరభద్రస్వామి నామస్మరణతో మార్మోగింది. వేలాదిగా తరలివచ్చిన భక్తులతో గ్రామం కిక్కిరిసింది. భద్రకాళీ, వీరభద్రేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రథోత్సవం కన్నుల పండువగా సాగింది. ఉదయం ఆలయంలో స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవాన్ని వేదమంత్రాల నడుమ నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు స్వామివారికి కానుకలను సమర్పించారు. సాయంత్రం అశేష భక్తజనసందోహం నడుమ రథోత్సవాన్ని కొనసాగించారు. రథోత్సవానికి ముఖ్య అతిథిగా పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు హాజరై మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం రథానికి కొబ్బరికాయకొట్టి రథాన్ని భక్తులతో కలసి ముందుకు లాగారు. ఎమ్మెల్యే వెంట టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి తుగ్గలి నాగేంద్ర, టీడీపీ సీనియర్‌ నాయకులు సాంబశివారెడ్డి, బత్తిని వెంకట్రాముడు, రామానాయుడు, నాయకులు రాజశేఖర్‌, వాకిటిసాయి, జగ్గులఅంజి, రాఘవేంద్ర, కిష్టన్న తదితరులు పాల్గొన్నారు. రథోత్సవం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సీఐ జయన్న సిబ్బందితో బందోబస్తును పర్యవేక్షించారు.

Updated Date - Feb 08 , 2025 | 12:04 AM