వైభవంగా హోమాలు
ABN , Publish Date - Nov 02 , 2025 | 11:08 PM
పట్టణంలోని వీవర్స్ కాలనీ మైదానంలో విశ్వశాంతి మహా యాగంలో భాగంగా ఆదివారం ఉదయం నుంచే యాగశాలలో హోమాలు ప్రారంభమయ్యాయి.
ఎమ్మిగనూరు, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని వీవర్స్ కాలనీ మైదానంలో విశ్వశాంతి మహా యాగంలో భాగంగా ఆదివారం ఉదయం నుంచే యాగశాలలో హోమాలు ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి యాగశాలలో పండితుల ఆధ్వర్యంలో హోమం నిర్వహించారు. సూర్య, సరస్వతి హోమాలు, సూర్య నమస్కారాలు, సాయంత్రం సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక కల్యాణాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శ్రీ కృష్ణమఠం పీఠాధిపతి స్వరూపానంద స్వామీజీ, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.