యాజమాన్య పద్ధతితో అధిక దిగుబడులు
ABN , Publish Date - Feb 08 , 2025 | 12:35 AM
రైతులు యాజమాన్యపద్ధతులు పాటించి అధిక దిగుబడులను సాధించవచ్చునని ధనూకా జపాన బృందం సభ్యులు సాజల్ బిస్వాస్ సాన, పూజితా సాన అన్నారు.

గోనెగండ్ల, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): రైతులు యాజమాన్యపద్ధతులు పాటించి అధిక దిగుబడులను సాధించవచ్చునని ధనూకా జపాన బృందం సభ్యులు సాజల్ బిస్వాస్ సాన, పూజితా సాన అన్నారు. శుక్రవారం వీరంపల్లి గ్రామంలో మిరపలో బూడిద తెగులు నివారణ చర్యల రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ధనూకా కంపెనీ వారు రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. సాగు చేసిన ఉల్లి, మిరప తోపాటు పలు పంటలను వారు పరిశీలించారు. వారు మాట్లాడుతూ మిరప, ఉల్లి, వేరుశనగ, తదితర పంటలలో బూడిద తెగులు అధికంగా వస్తుందన్నారు. ఈ తె గులు లావెల్లులా టౌరికా అనే ఫంగస్ వల్ల వస్తుందని, ఈ తెగులు సోకిన వెంటనే ఆకు దిగువ భాగంలో చిన్న తెల్లటి మచ్చలు కనిపిస్తాయని ఫంగస్ పెరుగుదలను బట్టి ఆకుపై భాగంలో లేత పసుపు రంగు మచ్చలు వ్యాపిస్తాయని తెలిపారు. ఇందుకు కాను నిస్సోడియమ్ అనే మందును వాడాలని రైతులకు సూచించారు. అలాగే పలు రకాల పంటలలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను, యాజమాన్య పద్దతులను, పంటసాగుకు ముందు వాలుకు అడ్డగా దున్నడం వల్ల కలిగే ఫలితాను వారు వివరించారు. కార్యక్రమంలో కంపెనీ జనరల్ మేనేజర్ హస్సేన వలి, డీజీఎం పరశురామయ్య లోకేశ్వరరెడ్డి, మోహనరెడ్డి, ఎల్‌బీ వెంకటేశ్వర్లు, కే. శ్రీనివాసులు, కర్నూలు టీమ్ సభ్యులు, వీరంపల్లి, తిప్పనూరు, గ్రామాల రైతులు పాల్గొన్నారు.