Share News

స్నేహితుడి కుటుంబానికి చేయూత

ABN , Publish Date - Jul 26 , 2025 | 12:53 AM

వెలుగోడు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 1997-98లో పదో తరగతి చదివిన విద్యార్థుల్లో శ్రీనివాసులు అనే వ్యక్తి ఇటీవల మృతి చెందాడు.

స్నేహితుడి కుటుంబానికి చేయూత
ఆర్థిక సాయం అందజేస్తున్న మిత్రులు

వెలుగోడు, జూలై 25(ఆంధ్రజ్యోతి): వెలుగోడు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 1997-98లో పదో తరగతి చదివిన విద్యార్థుల్లో శ్రీనివాసులు అనే వ్యక్తి ఇటీవల మృతి చెందాడు. స్నేహితులంతా కలిసి రూ.50,500 స్నేహితుడి భార్య అపర్ణకు శుక్రవారం అందజేశారు. ఆ నిధులను చిన్నారుల చదువులకు వినియోగించుకోవాలని, తాము అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఖాదర్‌వలి, శేషు, రాజశేఖర్‌, గోవర్ధన్‌, జావీద్‌, రవూఫ్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - Jul 26 , 2025 | 12:53 AM