పేదరిక నిర్మూలనే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి ఫరూక్
ABN , Publish Date - Jul 19 , 2025 | 12:54 AM
పేదరిక నిర్మూలనే ప్రభుత్వ లక్ష్యమని, ఇందుకోసం స్వర్ణాంధ్ర 2047 విజన్ ప్లాన్‌లో భాగంగా ప్రభుత్వం పీ4 విధానాన్ని రూపొందించిందని న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ అన్నారు.
నంద్యాల టౌన్, జూలై 18(ఆంధ్రజ్యోతి): పేదరిక నిర్మూలనే ప్రభుత్వ లక్ష్యమని, ఇందుకోసం స్వర్ణాంధ్ర 2047 విజన్ ప్లాన్‌లో భాగంగా ప్రభుత్వం పీ4 విధానాన్ని రూపొందించిందని న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ అన్నారు. పట్టణంలోని ఎన్టీఆర్ షాదదీఖానాలో శుక్రవారం జరిగిన మార్గదర్శుకుల అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ ఇప్పటికే బంగారు కుటుంబాలను ప్రాథమిక సర్వే ద్వారా గుర్తించినట్లు తెలిపారు. అందుకు సంబంధించిన తుది జాబాతాను త్వరలోనే తెలియజేస్తామన్నారు. ఆగస్టు నాటికి తుది జాబితాలో ఉన్న బంగారు కుటుంబాలను మార్గదర్శకులు దత్తత తీసుకునేలా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటుందన్నారు. బంగారు కుటుంబాలు ఆర్థికంగానే కాకుండా చదువు, వైద్యం, ఇతర మౌలిక సదుపాయాలు పరంగా అభివృద్ధి చేసేందుకు మార్దదర్శకులు తోడ్పాటు అందిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి విసృతంగా తీసుకెళ్లి దిగ్విజయం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్ర మంలో నంద్యాల మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, అసిస్టెంట్ కమిషనర్ దాస్, వివిధ శాఖల అధికారులు, నాయకులు పాల్గొన్నారు.