Share News

రైతు సంక్షేమానికి ప్రభుత్వం కృషి

ABN , Publish Date - Nov 20 , 2025 | 01:20 AM

రైతు సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్యెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు.

రైతు సంక్షేమానికి ప్రభుత్వం కృషి
దైవందిన్నెలో చెక్కు విడుదల చేస్తున్న ఎమ్మెల్యే బీవీ

ఎమ్మిగనూరు రూరల్‌, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): రైతు సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్యెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు. మండలంలోని దైవందిన్నె గ్రామంలో నియోజకవర్గంలోని రైతులకు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్‌ కింద మంజూరైన 25.789కోట్ల చెక్కును బుధవారం విడుదల చేశారు. అనంతరం గ్రామం లోని ఇంటింటికి తిరిగి ప్రజాసమస్యలు అడిగి తెలుసుకుకుకున్నారు. గ్రామంలోని ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. గ్రామంలో ఎక్కడా కూడా తాగునీరు, సీసీ రోడ్ల సమస్యలు ఉండకూడదని అధికారులకు తెలియజేశారు. ఎక్కడెక్కడ తాగునీటి కుళాయిలు వేయాలని, సీసీ రోడ్లు, డ్రైనేజీలు వేయాలనే విషయాలను నేరుగా అధికారులతో చర్చించి సమస్యల పరిష్కారం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. గ్రామంలోని పాఠశాలను సందర్శించి ఏవైనా సమస్యలు ఉన్నాయా..లేదా అనే విషయాలను అక్కడి ఉపాధ్యాయులు, విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలో రూ.30 లక్షలతో ఏర్పాటు చేసిన సీసీ రోడ్లను, సచివాలయాన్ని, ప్రారంభించారు. ఆయన విలేకరు సమావేశంలో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో కేవలం మాటలు తప్ప ఒక్క అభివృద్ధి పనికూడా చేయలేదన్నారు. రోడ్ల నిర్మాణానికి ఒక్క పిడికెడు మట్టిని కూడా వెయ్యలేదన్నారు. వైసీపీ ప్రభుత్వంలో పంచాయతీ నిధులను కూడా దారిమళ్లించారన్నారు. దైవందిన్నె గ్రామంలో వైసీపీ హయాంలో కనీసం తాగేందుకు కూడా గుక్కెడు నీరు కూడా దొరకని పరిస్థ్థితి ఉండేదన్నారు. తాము అధికారంలోకి వచ్చిన 17నెలల్లోనే గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి పథంలో నపిడిస్తున్నామన్నారు. పాఠశాలలు అభివృద్ది చేస్తామని చెప్పి పాఠశాలలకు కేవలం రంగులు వేసి చేతులు దులుపేసుకున్నారన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నానని చెప్పారు. టీడీపీ మండల కన్వీనర్‌ కేటీ వెంకటేశ్వర్లు, చంద్రన్న, జగదీష్‌, రాఘవేంద్ర, ఎంపీడీవో బంగారమ్మ, ఏడీఏ హమ్మద్‌ఖాద్రీ, ఏవో శివశంకర్‌, ఏఈవో నరసింహులు, పీఆర్‌ ఏఈ జయన్న, ఆయాశాఖల అధికారులు పాల్గొన్నారు.

కౌతాళం: రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని టీడీపీ మంత్రాలయం నియోజకవర్గ ఇన్‌చార్జి రాఘవేంద్ర రెడ్డి అన్నారు. కౌతాళంలో బుధవారం వ్వవసాయశాఖ ఆధ్వర్యంలో అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్‌ పథకం కింద రైతులకు పెట్టుబడి సాయం కింద రెండో విడత నగదు జమ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ, బీజేపీ, జనసేన మంత్రాలయం నియోజకవర్గ ఇన్‌చార్జిలు రాఘవేంద్ర రెడ్డి, విష్ణువర్ధన్‌ రెడ్డి, లక్ష్మన్న ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రాఘవేంద్ర రెడ్డి మాట్లాడుతూ రైతులకు పెట్టుబడి సాయం కింద సంవత్సరానికి రూ.20వేల నగదును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అందిస్తున్నాయని, ఇందులో భాగంగా రెండో విడతలో రైతుల బ్యాంకు ఖాతాలోకి రూ.7వేలు జమ చేశామని తెలిపారు. ఇందులో రాష్ట్ర వాటా అన్నదాత సుఖీభవ కింద రూ.5వేలు, కేంద్ర వాటా పీఎం కిసాన్‌ పథకం కింద రూ.2వేలు అందిస్తున్నట్లు తెలిపారు. అనంతరం నియోజకవర్గ రైతులకు రూ.27.616కోట్లు మంజూరు కాగా కౌతాళం మండలానికి రూ.9.23కోట్లు మంజూరు అయినట్లు తెలిపారు. ఈ చెక్కును వ్వవసాయాధికారులతో కలిసి ప్రదానం చేశారు. అనంతరం మండల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మండల ప్రత్యేకాధికారి రాజు, తహసీల్దార్‌ రజినీకాంత్‌ రెడ్డి, సీఐ అశోక్‌ కుమార్‌, కౌతాళం, పెద్దకడబూరు మండలాల టీడీపీ అధ్యక్షులు సురేష్‌ నాయుడు, మల్లికార్జున, కౌతాళం, బదినేహల్‌ సొసైటీ అధ్యక్షులు వెంకటపతిరాజు, మారెప్ప, కోసిగి మండల నాయకులు నర్సారెడ్డి, జ్ఞానేష్‌, కౌతాళం మండల నాయకులు అడివప్పగౌడ్‌, రాజానందు, వీరేష్‌, వ్యవసాయాధికారి శేషాద్రి కూటమి నాయకులు పాల్గొన్నారు.

పెద్దకడబూరు: అభివృద్ధి, సంక్షేమం కూటమి ధ్యేయమని టీడీపి రాష్ట్ర రైతు సంఘం అధికార ప్రతినిధి రమాకాంత్‌ రెడ్డి అన్నారు. బుధవారం పెద్దకడబూరులోని రైతు సేవా కేంద్రం-2లో అన్నదాత సుఖీభవ విడుదల సీఎం చంద్రబాబు లైవ్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతుల పక్షాన కూటమి తరుపున, సీఎం చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సింగల్‌ విండో చైర్మన్‌ మీసేవ ఆంజినేయులు, నాయకులు మల్లికార్జున, రైతులు పాల్గొన్నారు.

Updated Date - Nov 20 , 2025 | 01:20 AM