బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండ
ABN , Publish Date - Dec 17 , 2025 | 12:21 AM
ఆరోగ్యం బాగా లేకపోయి సొంత డబ్బులతో చికిత్సలు చేయించుకున్న బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటోందని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఎన్.రాఘవేంద్రరెడ్డి అన్నారు.
మంత్రాలయం, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): ఆరోగ్యం బాగా లేకపోయి సొంత డబ్బులతో చికిత్సలు చేయించుకున్న బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటోందని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఎన్.రాఘవేంద్రరెడ్డి అన్నారు. మండలంలోని మాధవరం గ్రామంలోని తన నివాసంలో మంగళవారం మంచాల కేడీసీసీ అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి చావిడి వెంకటేష్, మాజీ జడ్పీటీసీ లక్ష్మయ్య, పల్లిపాడు రామిరెడ్డి, ముత్తురెడ్డి, ఎస్‌ఎం గోపాల్‌రెడ్డి, ఎస్‌పీ భాస్కర్‌రెడ్డి, సతీష్ నాయుడు, ఎల్‌ఎల్‌స్సీ కాలువ అధ్యక్షులు మాలపల్లి చంద్ర ఆధ్వర్యంలో సీఎం సహయనిధికింద నాలుగు మండలాల్లోని 24 మందికి మంజూరైన రూ.8.36 లక్షలు చెక్కులను పంపిణీ చేశారు. ఇందులో పెద్దకడబూరు మండలంలోని ఐదుగురికి రూ.1,36,874, కౌతాళం మండలంలోని ఏడుగురికి రూ.3,15,985, కోసిగి మండలంలోని ఆరుగురికి రూ.1,49,123, మంత్రాలయం మండలంలోని ఐదుగురికి రూ. 2,34,328 మంజూరైన చెక్కులను ఆయా మండలాల టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో బాధితులకు అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా ఆపదవస్తే ఆదుకు నేందుకు బాధితుల తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్, అధికారులతో మాట్లాడి సీఎం సహాయ నిధి మంజూరు చేయించామని చెప్పారు. టీడీపీ నాయకులు రఘునాథరెడ్డి, రాకేష్ రెడ్డి, నర్సిరెడ్డి, రామకృష్ణ, వక్రాని వెంకటేష్,అంజి, నర్సప్ప, మురళి, మల్లికార్జున, శివ, లక్షన్న, వంశీ, గూర్మింటి భీమిరెడ్డి,నాగరాజు, రామయ్య, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.