Share News

బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండ

ABN , Publish Date - Oct 10 , 2025 | 12:08 AM

ఆరోగ్యం బాగాలేక పోయి సొంత డబ్బులతో చికిత్సలు చేయించుకున్న బాధిత కుటుం బాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని టీడీపీ నియోజకవర్గ ఇంచార్జి ఎన్‌.రాఘవేంద్రరెడ్డి అన్నారు.

 బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండ
చెక్కులను పంపిణీ చేస్తున్న రాఘవేంద్రరెడ్డి, టీడీపీ నాయకులు

మంత్రాలయం, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): ఆరోగ్యం బాగాలేక పోయి సొంత డబ్బులతో చికిత్సలు చేయించుకున్న బాధిత కుటుం బాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని టీడీపీ నియోజకవర్గ ఇంచార్జి ఎన్‌.రాఘవేంద్రరెడ్డి అన్నారు. మండలంలోని మాధవరంలోని తన నివాసంలో గురువారం మంచాల కేడీసీసీ అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి చావిడి వెంకటేశ్‌, మాజీ జడ్పీటీసీ లక్ష్మయ్య, ఎల్లెల్సీ కాలువ అధ్యక్షుడు మాలపల్లి చంద్ర, టీడీపీ మండల కన్వీనర్‌ ఎస్‌ఎం గోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో సీఎం సహాయ నిధి కింద మంజూరైన చెక్కులను పంపిణీ చేశారు. నాలుగు మండలాల్లోని 40 మందికి మజూరైన రూ.13,76,872 చెక్కులను పంపిణీ చేశారు. రాఘవేంద్రరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఒకవైపు సంక్షేమం, అభివృద్ధి, సంపద సృష్టించేందుకు చంద్రబాబు అహర్నిశలు కృషిచేస్తున్నారని అన్నారు. టీడీపీ నాయకులు, మాజీ సర్పంచ్‌ రఘునాథరెడ్డి, రాకేశ్‌ రెడ్డి, రాజారెడ్డి, అడ్వకేట్‌ విజయ్‌కుమార్‌, జనసేన మండల నాయకులు యేసేపు, టీబీ డ్యాం బోర్డు చైర్మన్‌ టిప్పు సుల్తాన్‌, అడివప్పగౌడు, వెంకటపతిరాజు, రాఘవేంద్ర, శివ, పోలి వీరేష్‌, ఉసేని, రామకృష్ణ, వంశీ, గోపాల్‌, రాగన్న, విష్ణువర్ధన్‌, నాగరాజు, రామయ్య పాల్గొన్నారు.

Updated Date - Oct 10 , 2025 | 12:09 AM