విద్యార్థులకు అండగా ప్రభుత్వం
ABN , Publish Date - Dec 24 , 2025 | 12:41 AM
విద్యార్థుల సమస్యలను తీరుస్తూ ప్రభుత్వం వారికి అండగా ఉంటోందని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి రాఘవేంద్రరెడ్డి అన్నారు.
మంత్రాలయం, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): విద్యార్థుల సమస్యలను తీరుస్తూ ప్రభుత్వం వారికి అండగా ఉంటోందని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి రాఘవేంద్రరెడ్డి అన్నారు. మంత్రాలయం రాఘవేంద్ర నగర్ ప్రాథమిక పాఠశాల ఆవరణంలో రూ.30లక్షలతో నిర్మిస్తున్న భవిత కేంద్రానికి ఎంఈవో రాగన్న, హెచ్‌ఎం వీరేష్, ఏఈ రంగరాజు ఆధ్వర్యంలో భూమిపూజ చేశారు. ముఖ్య అతిఽథిగా వచ్చిన రాఘవేంద్రరెడ్డికి ఉపాధ్యాయులు ఘనంగా స్వాగతం పలికారు. గడ్డపార పట్టిమట్టిని తవ్వి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. టీడీపీ టౌన్ అధ్యక్షులు వరదరాజు, రాకేష్‌రెడ్డి, రాఘవేంద్ర, చాపలనగేష్, లక్ష్మన్న, ఏఈ రంగ రాజు, పవన్‌కుమార్, సీఆర్‌పీలు బంగారప్ప, భీమేష్, ఐఆర్‌టీ ఉపాఽధ్యా యులు కళ్యాణి, శివప్రసాద్, రమేష్, హెచ్‌ఎం వీరేష్, అను మేష్, నాయకులు భీమిరెడ్డి, శివ, లక్ష్మన్న, రామయ్య, కార్యకర్తలు పాల్గొన్నారు.