Share News

20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యం: మంత్రి

ABN , Publish Date - Apr 11 , 2025 | 01:14 AM

రాష్ట్రంలో రాబోయే ఐదేళ్లలో 20లక్షల ఉద్యోగాలు కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని న్యాయ, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ అన్నారు.

20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యం: మంత్రి
ఉద్యోగాలకు ఎంపికైన వారికి నియామకపత్రాలు అందజేస్తున్న మంత్రి ఫరూక్‌, కలెక్టర్‌ రాజకుమారి

నంద్యాల ఎడ్యుకేషన్‌/మున్సిపాలిటీ, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రాబోయే ఐదేళ్లలో 20లక్షల ఉద్యోగాలు కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని న్యాయ, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ అన్నారు. నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన మెగా జాబ్‌మేళాను కలెక్టర్‌ రాజకుమారితో కలిసి ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ జాబ్‌మేళాలో 14 పేరుపొందిన కంపెనీలు పాల్గొని 589 మందికి ఉద్యోగాలు కల్పించినట్లు తెలిపారు. మంత్రి తనకు తెలిసిన అనేక కంపెనీలు నంద్యాలలో జాబ్‌మేళాలను ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తున్నారని తెలిపారు. కలెక్టర్‌ మాట్లాడుతూ విద్యార్థులు కోర్‌ సబ్జెక్టుల్లో కమాండ్‌ రోల్‌ ఉండడంతో పాటు అదనపు నైపుణ్యాల్లో శిక్షణ తీసుకుంటే పోటీ పరీక్షల్లో నెగ్గుకుని రాగలరని అన్నారు. డీఎస్‌డీవో శ్రీకాంత్‌రెడ్డి, డీఆర్‌డీవో శ్రీధర్‌రెడ్డి, ఎంప్లాయిమెంట్‌ ఆఫీసర్‌ సోమశివారెడ్డి, సెట్కూర్‌ సీఈవో వేణుగోపాల్‌, కోఆర్డినేటర్‌ పార్వతి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 11 , 2025 | 01:14 AM