Share News

వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు

ABN , Publish Date - Jan 31 , 2025 | 12:27 AM

నగరంలోని సంకల్‌బాగ్‌లో ఉన్న హరిహర క్షేత్రంలో గురువారం శ్రీవారి 19 వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి.

వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు
హరిహర క్షేత్రంలో పూజలు చేస్తున్న టీజీ వెంకటేశ, బీవీ రెడ్డి

ప్రారంభించిన మాజీ ఎంపీ టీజీ వెంకటేశ

కర్నూలు కల్చరల్‌, జనవరి 30(ఆంధ్రజ్యోతి): నగరంలోని సంకల్‌బాగ్‌లో ఉన్న హరిహర క్షేత్రంలో గురువారం శ్రీవారి 19 వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ హాజరై వేద మంత్రోచ్ఛారణల మధ్య ధ్వజారోహణ చేసి వేడుకలను ప్రారంభించారు. అనంతరం ఆలయంలోని శ్రీదేవీ, భూదేవీ సమేత వేంకటేశ్వర స్వామిని దర్శించుకొని పూజలు చేశారు. ఈ సందర్భంగా టీజీ వెంకటేశ మాట్లా డుతూ ముప్పయ్‌ సంవత్సరాల క్రితం బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు తెలిపారు. అప్పటి నుంచీ ఎంతో నియమ, నిష్టలతో తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన విధంగా పూజలు జరుగుతున్నాయని అన్నారు. ఈ సందర్భంగా టీజీ వెంక టేశను నగర బ్రాహ్మణ సంఘం నాయకులు ఘనంగా సత్క రించారు. కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త, చిత్ర నిర్మాత బీవీ రెడ్డి, ఆలయ కమిటీ ప్రతనిధులు సీవీ దుర్గాప్రసాద్‌, శ్రీధర్‌, శ్యామసుందర్‌రావు, చల్లా నాగరాజ శర్మ, నాగులవరం రాజశేఖర్‌, సీఎస్‌ ప్రసాద్‌రావు, టీవీ రవి చంద్ర శర్మ, సుబ్రహ్మణ్యం, ఆర్యవైశ్య సంఘం నాయులు ఇల్లూరు లక్ష్మయ్య, కార్పొరేటర్‌ పరమేష్‌ పాల్గొన్నారు.

బ్రహ్మోత్సవాలకు తరలి వచ్చిన భక్తులు: బ్రహ్మోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామి, అమ్మవార్లకు పూజలు చేశారు. ఆలయంలో మూల మూర్తులతోపాటు, ఉత్సవమూర్తులకు ఆలయ అర్చకులు మామి ళ్లపల్లి రాజేశ శర్మ, ప్రసన్న శర్మ, మహేశ శర్మ, గురు రాజారావులు పూజలు చేసి భక్తులకు స్వామి, అమ్మవార్ల దర్శనం కల్పించారు. ఆలయంలో తొలిరోజున సుప్రభాత సేవ, గోపూజ, అభిషేకాలు, అర్చనలు, అలంకరణ సేవలు చేపట్టారు. అలాగే ఉదయం విఘ్నాలు తొలగిపోయి, లక్ష్మీ ప్రాప్తికి లక్ష్మీగణపతి హోమాలు నిర్వహిం చారు. సాయంత్రం స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను శేష వాహ నంపై ఆసీనింపజేసి వీధుల్లో ఊరేగించారు.

Updated Date - Jan 31 , 2025 | 12:27 AM