Share News

వైభవంగా గణపతి హోమం

ABN , Publish Date - Feb 16 , 2025 | 11:38 PM

లోకకళ్యాణార్థం శ్రీశైల దేవస్థానం వారు సాక్షిగణపతి ఆలయంలో నిర్వహించిన గణపతి హోమం ఆధివారం పూర్ణాహుతితో ముగిసింది.

వైభవంగా గణపతి హోమం
గణపతి హోమం నిర్వహిస్తున్న అర్చకులు

శ్రీశైలం, ఫిబ్రవరి 16(ఆంధ్రజ్యోతి): లోకకళ్యాణార్థం శ్రీశైల దేవస్థానం వారు సాక్షిగణపతి ఆలయంలో నిర్వహించిన గణపతి హోమం ఆధివారం పూర్ణాహుతితో ముగిసింది. సంకష్టహర చతుర్థిని పురస్కరించుకొని సాక్షిగణపతి ఆలయంలో ప్రత్యేక అభిషేకం, పుష్పార్చన తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైదిక సంప్రదాయంలో భాగంగా ఆలయ వేదపండితులు, అర్చకులు గణపతి హోమం నిర్వహించారు. అనంతరం యాగ సమిధలను అగ్నికి ఆహుతి చేశారు. ఆదివారం జరిగిన ప్రతేక పూజల్లో మల్లికార్జున స్వామి వారి ఆలయ ప్రధాన అర్చకులు హెచ్‌.వీరయ్య, అర్చకులు ఉమానాగేశ్వర శాస్ర్తి, వేదపండితులు గంట్టి రాధాకృష్ట శర్మ, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Feb 16 , 2025 | 11:38 PM