Share News

వైభవంగా గిరి ప్రదక్షిణ

ABN , Publish Date - Feb 13 , 2025 | 12:04 AM

శ్రీశైల మహా క్షేత్రంలో బుధవారం పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీగిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని దేవస్థానం ఘనంగా నిర్వహించింది.

వైభవంగా గిరి ప్రదక్షిణ
గిరి ప్రదక్షిణ నిర్వహిస్తున్న అధికారులు, అర్చకులు

శ్రీశైలం, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): శ్రీశైల మహా క్షేత్రంలో బుధవారం పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీగిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని దేవస్థానం ఘనంగా నిర్వహించింది. సాయంత్రం స్వామి, అమ్మవార్ల మహామంగళ హారతుల అనంతరం స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి పల్లకిలో ఊరేగింపుగా గిరిప్రదక్షిణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ గిరిప్రదక్షిణ కార్యక్రమం ఆలయ రాజగోపురం నుంచి ప్రారంభమై గంగాధ ర మండపం, అంకాళమ్మ ఆలయం, నంది మండపం, మల్లికార్జున సదనం, బయలు వీరభద్రస్వామి ఆలయం, అక్కడి నుంచి వలయదారి మీదుగా గణేశ్‌ సదనం, సారంగఽధర మండపం, గోశాల, మల్లమ్మ కన్నీరు, మహిషాసుర మర్దిని, రుద్రాక్ష మఠం, విభూతిమఠాల మీదుగా రుద్రవనం చేరుకొని తిరిగి నంది మండపం చేరుకోవడంతో శ్రీశైల గిరి ప్రదక్షిణ కార్యక్రమం ముగిసింది. క్షేత్రపరిధిలోని ప్రాచీన మఠాలు, ఆలయాలను భక్తులచే దర్శింపచేస్తూ భక్తులలో ఆధ్యాత్మిక భావాలను పెంపొందిస్తూ, క్షేత్రాన్ని ఆధ్యాత్మికంగా తీర్చిది ద్దడంలో భాగంగా గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని దేవస్థానం నిర్వహిస్తుంది. ఇల కైలాసంగా ప్రసిద్ధమైన శ్రీశైల మహాక్షేత్రంలో గిరిప్రదక్షిణ చేయడం ఎంతో ఫలదాయకమని చెప్పబడుతుంది.

Updated Date - Feb 13 , 2025 | 12:04 AM