Share News

అమ్మాయిలు చదువుకోవాలి: ఎస్పీ

ABN , Publish Date - Feb 13 , 2025 | 12:54 AM

అమ్మాయిలు చదువుకుంటే ఆ కుటుంబం బాగుపడుతుందని ఎస్పీ విక్రాంత పాటిల్‌ అన్నారు.

అమ్మాయిలు చదువుకోవాలి: ఎస్పీ
పాఠశాలను పరిశీలిస్తున్న ఎస్పీ విక్రాంత పాటిల్‌

ఎమ్మిగనూరు టౌన, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): అమ్మాయిలు చదువుకుంటే ఆ కుటుంబం బాగుపడుతుందని ఎస్పీ విక్రాంత పాటిల్‌ అన్నారు. బుధవారం పట్టణంలోని మాచాని సోమప్ప బాలికల ఉన్నత పాఠశాలను ఎస్పీ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ విక్రాంత పాటిల్‌, రిటైర్డ్‌ ఐజీ ఇక్బాల్‌ పాఠశాల పరిసర ప్రాంతాలను పరిశీ లించారు. ఈ సందర్భంగా విద్యార్థినులతో ఏర్పాటు చేసిన సమావేశం లో ఎస్పీ మాట్లాడుతూ అమ్మాయిలు చదువుకుంటే ఆర్థికంగా కుటుం బానికి అండగా నిలబడుతుందన్నారు. అమ్మాయిలు బాగా చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని, అన్ని రంగాలలో రాణించాలని ఆకాం క్షించారు. ఆకతాయిలు ఈవ్‌టిజింగ్‌ చేస్తే పొలీసులకు సమాచా రం ఇవ్వాలని సూచించారు. రానున్న పదవ తరగతి పరీక్షలు బాగా రాసి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని కోరారు. సమావేశంలో హెచఎం కృష్ణమూర్తి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

రాఘవేంద్రుని సన్నిధిలో ఎస్పీ

మంత్రాలయం: రాఘవేంద్ర స్వామిని ఎస్పీ విక్రాంత పాటిల్‌ బుధవారం దర్శించుకున్నారు. మహాముఖ ద్వారం వద్ద మఠం అసి స్టెంట్‌ మేనేజర్‌ ఐపీ నరసింహామూర్తి ఘనంగా స్వాగతం పలికారు. గ్రామదేవత మంచాలమ్మను దర్శించుకుని రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి విశేష పూజలు చేశారు. మఠం పండితులు మెమెంటో, శేషవస్త్రం, ఫల, పుష్ప, మంత్రాక్షితలు, పరిమళ ప్రసాదం ఇచ్చి ఆశీర్వదించారు. ఆయన వెంట ఎమ్మిగనూరు డీఎస్పీ ఉపేంద్రబాబు, మం త్రాలయం ఎస్‌ఐ శివాంజల్‌, ఎస్బీ ఎస్‌ఐ వేణుగోపాలరాజు, హెడ్‌ కానిస్టేబుల్‌ రాఘవేంద్రఉన్నారు.

కోసిగి: విద్యార్థులు పదవ తరగతిలోనే ఒక లక్ష్యాన్ని ఎంచుకోవాలని ఎస్పీ విక్రాంత పాటిల్‌ సూచించారు. బుధవారం కోసిగిలోని ఇంటిగ్రే టెడ్‌ హాస్టల్‌ బాలుర ఉన్నత పాఠశాలను రిటైర్డు ఐజీ మహ్మద్‌ ఇక్బాల్‌ తో కలిసి ఎస్పీ పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆంధ్రజ్యోతి మెయిన దినపత్రికలో కర్నూలు పల్లెలు ఖాళీ, ప్రభుత్వ బడుల్లో తగ్గుతున్న హాజరు శాతం అనే కథనం తమను కలిచివేసిందన్నారు. కోసిగి మండలం కర్ణాటకకు బార్డర్‌లో ఉండటంతో పూర్తిగా వెనుకప డిందని, విద్యార్థులు కూడా తల్లిదండ్రుల వెంట వలసల బాటపడుతు న్నారన్నారు. సంబంధిత అధికారులు మండలంలో విద్యార్థులు వలసలు వెళ్లకుండా చదివించాలన్నారు. అనంతరం బాలుర ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు ఖలీల్‌ అహ్మద్‌ ఆధ్వర్యంలో పది విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం ఎస్పీ కోసిగి పోలీస్‌ స్టేషనలో రికార్డులను తనిఖీ చేశారు. ఎస్పీ వెంట ఎమ్మిగనూరు డీఎస్పీ ఉపేంద్రబాబు, కోసిగి సీఐ మంజునాథ్‌, ఎస్‌ఐ చంద్రమోహన, బాలుర ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులు ఎస్పీని సన్మానించారు.

Updated Date - Feb 13 , 2025 | 12:54 AM