Share News

వైభవంగా గిరి ప్రదక్షిణ

ABN , Publish Date - Mar 14 , 2025 | 12:02 AM

శ్రీశైల మహాక్షేత్రంలో గురువారం పౌర్ణమి ఘడియలు రావడంతో గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని దేవస్థానం ఘనంగా నిర్వహించింది.

వైభవంగా గిరి ప్రదక్షిణ
గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు

శ్రీశైలం, మార్చి 13(ఆంధ్రజ్యోతి): శ్రీశైల మహాక్షేత్రంలో గురువారం పౌర్ణమి ఘడియలు రావడంతో గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని దేవస్థానం ఘనంగా నిర్వహించింది. సాయంత్రం స్వామి, అమ్మవార్ల మహా మంగళ హారతుల అనంతరం స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి పల్లకిలో ఊరేగింపుగా గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని నిర్వహించారు.

శ్రీశైల మహాక్షేత్రంలో పౌర్ణమి ఘడియలను పురస్కరించుకొని సాయంత్రం భ్రమరాంబ అమ్మవారికి లక్ష కుంకుమార్చనను శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు వారి గోత్రనామాలతో లక్షకుంకుమార్చనలో పాల్గొనేందుకు దేవస్థానం పరోక్ష సేవ ద్వారా అవకాశం కల్పించింది. శ్రీశైల క్షేత్రానికి స్వయంగా విచ్చేయలేని భక్తులు వారి గోత్ర నామాలతో ఆయా ఆర్జిత సేవలలో పాల్గొనేందుకు ఆన్‌లైన్‌ ద్వారా రూ. 1,116 సేవా రుసుమును చెల్లించి పరోక్ష సేవలో పాల్గొనవచ్చును. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈవో ఎం.శ్రీనివాసరావు సూచించారు.

శ్రీశైల క్షేత్రంలో లోక కల్యాణార్థం పౌర్ణమిని పురస్కరించుకొని స్వామి, అమ్మవార్లకు ఊయల సేవ, పల్లకీ ఉత్సవం నిర్వహించారు.

Updated Date - Mar 14 , 2025 | 12:02 AM