Share News

ఘంటసాల.. ప్రపంచానికే గర్వకారణం

ABN , Publish Date - Feb 12 , 2025 | 12:32 AM

ఘంటసాల ప్రపంచ మంతా గర్వించదగ్గ గాయకుడని, ఆయన తెలుగువాడిగా జన్మించడం తెలుగువారికి గర్వకారణమని పలువురు వక్తలు నివాళి అర్పించారు.

ఘంటసాల.. ప్రపంచానికే గర్వకారణం
ఘంటసాల విగ్రహానికి నివాళి అర్పిస్తున్న వైద్యులు

ప్రముఖుల నివాళి

కర్నూలు కల్చరల్‌, ఫిబ్రవరి 11(ఆంధ్రజ్యోతి): ఘంటసాల ప్రపంచ మంతా గర్వించదగ్గ గాయకుడని, ఆయన తెలుగువాడిగా జన్మించడం తెలుగువారికి గర్వకారణమని పలువురు వక్తలు నివాళి అర్పించారు. మంగళవారం ప్రముఖ తెలుగు చలనచిత్ర నేపథ్య గాయకుడు, సంగీత దర్శకుడు దివంగత ఘంటసాల వెంకటేశ్వరరావు 51వ వర్ధంతిని నగరంలోని ఆయకర్‌ భవన కూడలిలోని ఘంటసాల విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. ఘంటసాల విగ్రహానికి పూలదండలు వేసి ఆయన సేవలను శ్లాఘించారు. ప్రముఖ గ్యాసో్ట్రఎంటరాలజిస్టు డాక్టర్‌ బి. శంకరశర్మ మాట్లాడుతూ దైవం మానుష రూపేణా అన్న సూక్తికి ఘంటసాల అక్షర సత్యంగా నిలిచిపోతారని కొనియాడారు. విశ్రాంత ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్‌ డాక్టర్‌ భవానీ ప్రసాద్‌ మాట్లా డుతూ ఘంటసాల గొంతెత్తి పాడితే ప్రపంచమే ఉలిక్కిపడి చూస్తుం దని అన్నారు. ప్రముఖ కార్డియాలజిస్టు డాక్టర్‌ చంద్రశేఖర్‌ మాట్లాడు తూ ఘంటసాల గాన కళాసమితి వారు ఏటా ఆయన జయంతి, వర్ధం తులను ఘనంగా నిర్వహించడం ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉందని చెప్పారు. కార్యక్రమంలో న్యూరోసర్జన డాక్టర్‌ డబ్ల్యూ సీతారాం, శ్రీశైలం స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ కొండయ్య, పద్మశ్రీ ఘంటసాల గానకళా సమితి అధ్యక్షుడు వాసుదేవమూర్తి, టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు విద్వాన పత్తి ఓబులయ్య, ఘంటసాల గాన కళాసమితి అధ్యక్షుడు బీఎస్‌రావు, గాయకులు సుధారాణి, రమణయ్య, రాఘవేంద్ర ప్రసాద్‌ పాల్గొన్నారు.

Updated Date - Feb 12 , 2025 | 12:32 AM