రిపేరీలో చెత్త తొలగించే వాహనాలు
ABN , Publish Date - Feb 13 , 2025 | 11:21 PM
నగర పాలక సంస్థ పరిధిలో చెత్త తొలగించేందుకు వాడే వివిధ రకాల వాహనాలు మరమ్మతు కారణంగా చెత్త సేకరణకు పనికి రావడం లేదు. దీంతో పారిశుధ్య పనులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి

మరమ్మతులు చేయించడంలో అధికారుల కాలయాపన
రిపేరీ పనుల్లో రూ.28 లక్షలు పెండింగ్
కర్నూలు న్యూసిటీ, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): నగర పాలక సంస్థ పరిధిలో చెత్త తొలగించేందుకు వాడే వివిధ రకాల వాహనాలు మరమ్మతు కారణంగా చెత్త సేకరణకు పనికి రావడం లేదు. దీంతో పారిశుధ్య పనులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ వాహ నాలకు అధికారులు మరమ్మతు చేయించడం లేదు. గత సంవత్సరం వాహనాల మరమ్మతు పనులకు సుమారు రూ.42 లక్షల బిల్లులు పెండింగ్‌లో ఉండేవి. అప్పటి నుంచి రిపేరీ చేసే షోరూంలోనే ఉండపోయాయి. కమిషనర్‌గా రవీంద్రబా బు బాధ్యతలు చేపట్టాక రూ.14 లక్షలు చెల్లించారు. దీంతో కొన్ని వాహనాలను పారిశుధ్య పనుల్లో విని యోగిస్తున్నారు. మర మ్మతు చేయకపోవ డంతో ఇంకా 19 వాహనాలు నిరుపయోగంగా ఉండిపో యాయి. 19, ప్రైవేటు ఆసుప త్రుల సౌజన్యంతో మరో నాలుగు కలిసి 23 ట్రాక్టర్లు ఉన్నాయి. అదే విధంగా కంపాక్టర్లు పెద్దవి 5 ఉన్నాయి. చిన్నవి 10 ఉండగా 4 షోరూంలో ఉన్నాయి. నగర పాలక సంస్థకు 13 ఆటోలు ఉండగా ఒకటి రిపేరీలో ఉంది. ఎక్స్‌కవే టర్లు మూడు ఉండగా ఒకటి రిపేరిలో ఉంది. ఒక హిటాచి ఉండగా దాని మరమ్మతుల కోసం గత సంవత్సరం డిసెంబరులో రూ.3,50,000 ఖర్చు పెట్టారు. ఎనిమిది టిప్పర్లలో ఒకటి రిపేరిలో ఉంది. డ్రోజర్ ఒక్కటి ఉంది. గల్ఫర్లు 2 ఉండగా ఒక్కటి రిపేరిలో ఉంది. మినీ ఎక్స్‌కవేటర్లు ఐదు ఉండగా రెండు మాత్రమే పని చేస్తున్నాయి. మిగిలిన మూడు మరమ్మతులతో షోరూంలో ఉన్నాయి. ఇలా ప్రతి వాహనంలో ఒక్కటి షోరూంకే పరిమితం కావడంతో చెత్త సేకరణ ఇబ్బందిగా మారింది.
రూ.28 లక్షల పెండింగ్
నగరంలోని వివిధ రకాల షోరూంలో ఉన్న వాహనాల మరమ్మతులకు సుమారు రూ.28 లక్షల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. వాహనాలన్నీ రిపేరీ అయ్యాయి. కేవలం బిల్లులు చెల్లించిన వెంటనే వాహనాలు బయటికి వస్తాయి. ఇటీవల మంత్రి టీజీ భరత్ వాహనాల మరమ్మతులపై ఉన్నతాధికారులతో ఆరా తీశారు. అయితే అన్ని వాహనాలు బయటనే ఉన్నాయని కొన్ని మాత్రమే షోరూంలో ఉన్నాయని అధికారులు చెప్పినట్లు తెలిసింది.
బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి
మరమ్మతుల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని చెల్లించిన వెంటనే వాహనాలు బయటికి వస్తాయి. చెత్త సేకరణకు ఎలాంటి అడ్డకుంలు ఉండవు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. త్వరలోనే అన్ని వాహనాలు బయటికి వస్తాయి. - కె.విశ్వేశ్వరరెడ్డి, ప్రజారోగ్య అధికారి.