Share News

ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలి

ABN , Publish Date - Mar 07 , 2025 | 12:12 AM

ఆర్డీఎస్‌ కుడికాలువ, వేదావతి, గుండ్రేవుల ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని దళిత సమైఖ్య పశ్చిమ ప్రాంత సాగు నీటి సాధన కమిటీ జిల్లా నాయకుడు నరసప్ప డిమాండ్‌ చేశారు.

ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలి
నిరసన తెలుపుతున్న నాయకులు

నందవరం, మార్చి 6(ఆంధ్రజ్యోతి): ఆర్డీఎస్‌ కుడికాలువ, వేదావతి, గుండ్రేవుల ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని దళిత సమైఖ్య పశ్చిమ ప్రాంత సాగు నీటి సాధన కమిటీ జిల్లా నాయకుడు నరసప్ప డిమాండ్‌ చేశారు. గురువారం నందవరం బస్టాండ్‌లో నిర సన తెలిపారు. విభజన చట్టాల్లోని హామీలను అమలు చేయాలన్నారు. అలాగే ఆర్డీఎస్‌ కుడి కాలువకు, వేదవతి, గుండ్రేవుల ప్రాజెక్టులకు నిధులు కేటాయించి పనులు చేయాలన్నారు. దీంతో పశ్చిమ ప్రాంత రైతులు, ప్రజలకు, తాగు, సాగు నీటి సమస్య తీరుతుందన్నారు. అలాగే ఎల్లెల్సీ ఆయకట్టును స్థిరీకరించాలన్నారు. కార్యక్రమంలో నాగప్ప, వలీ, ప్రసాద్‌, తాయన్న, ఆదాము, యోహోవా పాల్గొన్నారు.

Updated Date - Mar 07 , 2025 | 12:12 AM