ఇంటింటికీ మంచినీరు
ABN , Publish Date - Feb 08 , 2025 | 12:07 AM
ఇంటింటికీ కొళాయి కనెక్షన్ల ద్వారా రక్షిత మంచినీరు అందించాలనే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ‘జల జీవన్ మిషన్’ తీసుకొచ్చింది.

జలజీవన్ మిషన్‌లో భారీ అక్రమాలు
కూటమి రాకతో జేజేఎం పనుల్లో మార్పులు
జలాశయాల నుంచి నీటి సరఫరాకు ప్రణాళిక
జిల్లాలో 721 గ్రామాలకు శుద్ధి చేసిన తాగునీరు
రూ.1,542 కోట్లతో ప్రతిపాదనలు
1.77 టీఎంసీలు అవసరమని అంచనా
ఇంటింటికీ కొళాయి కనెక్షన్ల ద్వారా రక్షిత మంచినీరు అందించాలనే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ‘జల జీవన్ మిషన్’ తీసుకొచ్చింది. గత వైసీపీ హయాంలో రూ.313.56 కోట్లతో 1,548 పనులు చేపట్టారు. సగం పనులు కూడా పూర్తి చేయకపోగా.. ఆ పనుల్లోనూ భారీ అవినీతి అక్రమాలు జరిగాయి. అంతేకాదు బోర్లు తవ్వి కొళాయి కనెక్షన్లు ఇవ్వడంతో ముప్పాతిక శాతం అలంకారప్రాయంగా మారాయి. టీడీపీ కూటమి ప్రభుత్వం రాగానే గత ప్రభుత్వ ప్రతిపాదనలు రద్దు చేసి జలజీవన్ మిషన్ (జేజేఎం) పనుల్లో సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది. సమీప జలాశయాల నుంచి పైపులైన్ల ద్వారా నీటిని తరలించి, 365 రోజులు శుద్ధి చేసిన రక్షిత మంచినీరు సరఫరా చేసేలా డిజైన్లు తయారు చేస్తున్నారు. జిల్లాలో 721 గ్రామాలకు స్వచ్ఛమైన తాగునీరు అందించేదుకు రూ.1,542 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఆ వివరాలపై ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం
కర్నూలు, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో 484 గ్రామ పంచాయతీలు, 237 మజారా గ్రామాలు ఉన్నాయి. 33 సమగ్ర రక్షిత మంచినీటి పథకాలు (సీపీడబ్ల్యూఎస్) 351 గ్రామాలకు శుద్ధి చేసిన తాగునీరు సరఫరా చేస్తున్నామని గ్రామీణ తాగునీటి సరఫరా చేస్తున్నట్లు ఇంజనీర్లు పేర్కొంటున్నారు. జిల్లా గ్రామీణ ప్రాంతంలో 3,38,865 జన నివాసాలు ఉంటే నివాసాలు ఉన్నాయి. 2020 ఏప్రిల్ ఒకటో తేదీకి ముందు వరకు కేవలం 60,239 ఇళ్లకు మాత్రమే కొళాయి కనెక్షన్లు ఉన్నాయి. అంటే 82.22 శాతం ప్రజలు వీఽధికొళాయిలు, బోర్లు, వంకలు, వాగుల్లో చెలిమిలపై ఆధారపడ్డారు. ఇంటింటికి కొళాయి కనెక్షన్ ఇవ్వడంతో పాటు రక్షిత మంచినీరు సఫరా చేయాలనే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం 2020 ఏప్రిల్‌లో ‘జలజీవన్ మిషన్ (జేజేఎం)’ పథకం తీసుకొచ్చింది. అందుబాటులో ఉన్న నదులు, జలాశయాల ద్వారా శుద్ధి చేసిన నీటిని సరఫరా చేయాల్సి ఉంటే.. గత వైసీపీ హయాంలో అప్పటి ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు జలజీవన్ మిషన్‌ను ఆదాయవనరుగా మార్చుకున్నారు. బోర్లు తవ్వి నీటి సరఫరాకు శ్రీకారం చుట్టారు. కొళాయి కనెక్షన్లలో అంకెల గారడి చేసి ప్రజాధనం భారీ ఎత్తున స్వాహా చేశారు.
పల్స్ సర్వే ద్వారా అక్రమాలు వెలుగులోకి
జిల్లాలో జలజీవన్ మిషన్ పథకం అమలుకు ముందు అంటే 2020 ఏప్రిల్ ఒకటో తేదీ వరకు 90,710 ఇళ్లకు కొళాయి కనెక్షన్లు ఉన్నాయని, జేజేఎం కింద మరో 1,31,891 కనెక్షన్లు కలిపి 2,22,601 ఇళ్లకు కొళాయి కనెక్షన్లు (65,69 శాతం) ఇచ్చామని ఆర్‌డబ్ల్యూఎస్ ఇంజనీర్లు ఐఎంఐఎస్ వెబ్‌సైట్‌లో చూపించారు. అయితే జేజేఎం కింద కొళాయి కనెక్షన్లు ఇవ్వకపోయినా ఇచ్చిన బోగస్ లెక్కలు చూపి భారీగా ప్రజాధనం స్వాహా చేశారని జూలైలో జరిగిన జడ్పీ సమావేశంలో జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఏకరువు పెట్టారు. ఇంటింటికి వెళ్లి పల్స్ సర్వే నిర్వహించారు. ఆ సర్వే ప్రకారం 2020 ఏప్రిల్‌కు ముందు 60239 కొళాయి కనెక్షన్లు, జల్ జీవన్ మిషన్ కింద ఇచ్చిన 1,31,894 కనెక్షన్లు కలిపి 1,92,133 ఇళ్లకు కనెక్షన్లు ఉన్నాయని లెక్కలు తేల్చారు. అంటే 30,468 బోగస్ కొళాయి కనెక్షన్లు ఉన్నాయని నిగ్గుతేల్చారు. అయితే జేజేఎం మిషన్ అమలు ముందు ఇచ్చిన కొళాయి కనెక్షన్లు కొన్ని పని చేయడంలేదని, నిర్వహణ లేక నీరు అందడం లేనివి ఉన్నాయని మాయ చేస్తున్నారు. వాస్తవంగా జేజేఎం కింద ఇచ్చిన కొళాయి కనెక్షన్లలో భారీగా బోగస్ కనెక్షన్లు చూపి అందినకాడికి ప్రజా ధనం దోపిడి చేశారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. గత వైసీపీ ప్రభుత్వం ఈ పథకాన్ని ఆదాయ వనరుగా మార్చుకొని అస్థవ్యస్తంగా మార్చేసింది. టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక గత ప్రభుత్వం మంజూరు చేసిన జల్ జీవన్ మిషన్ పనులు ఆపేసింది.

జల జీవన్ మిషన్ కింద రక్షిత మంచినీటి సరఫరా ప్రతిపాదన వివరాలు
జలాశయం నియోజక మండ గ్రామాలు 2057 అవసరమైన కావాల్సిన
వర్గాలు లాలు నాటికి నీరు నిధులు
జనాభా (టీఎంసీల్లో) (రూ.కోట్లల్లో)
పులికనుమ మంత్రాలయం,
ఆదోని 5 163 5,78,576 0.4475 237.00
గాజులదిన్నె ఎమ్మిగనూరు, 7 171 6,77,403 0.5239 330.00
కోడుమూరు
పత్తికొండ ఆలూరు, పత్తికొండ 11 335 8,79,768 0.6804 705.00
గోరుకల్లు పాణ్యం 2 52 1,53,682 0.1189 270.00
మొత్తం 7 25 721 22,89,429 1.7707 1,542.00