బోధనేతర పనుల నుంచి విముక్తి కల్పించాలి
ABN , Publish Date - Jul 27 , 2025 | 12:35 AM
ఉపాధ్యాయులకు బోధనేతర పనుల నుంచి విముక్తి కల్పించాలని యూటీఎఫ్ నాయకులు కోరారు.
నంద్యాల ఎడ్యుకేషన్, జూలై 26(ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయులకు బోధనేతర పనుల నుంచి విముక్తి కల్పించాలని యూటీఎఫ్ నాయకులు కోరారు. శనివారం డీఈవో కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేసిన అనంతరం డీఈవో జనార్దన్‌రెడ్డికి వినతిపత్రం అందజే శారు. యూటీ ఎఫ్ నాయకులు ప్రసాద్, సుధాకర్ మాట్లాడుతూ బది లీలు పూర్తయి రెండు నెలలు గడిచినా ఇప్పటికీ క్యాడర్ స్ర్టెంత్ సమస్య, పొజిషన్ ఐడీల సమస్య పరిష్కారం కాలేదన్నారు. అధికారులు ఉపాధ్యా యుల జీతాల సమస్యపై దృష్టిసారించడం లేదన్నారు. నిరంతరం ఉపాధ్యాయులకు బోధనేతర కార్యక్రమాలు నిర్వహిస్తు న్నారని, దీనివల్ల విద్యార్థులకు చదువు దూరం అయ్యే ప్రమాదం ఏర్పడుతోందన్నారు. కార్యక్రమంలో రామ్మోహన్, రామకృష్ణుడు, ఖాశీం, నరసింహారెడ్డి, అరవింద్‌కుమార్‌చ గోపాల్, రమణ తదితరులు పాల్గొన్నారు.