Share News

ఉచితంగా చికెన్‌ పకోడీ, ఉడకబెట్టిన గుడ్లు

ABN , Publish Date - Feb 24 , 2025 | 12:13 AM

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని గూడూరు రోడ్డులో ఉన్న ఓ చికెన్‌ సెంటర్‌ వద్ద వెన్‌కాబ్‌ కంపెనీ డీలర్‌ జహంగీర్‌ ఆదివారం మాంసం ప్రియులకు కంపెనీ ఆధ్వర్యంలో ఉచితంగా చికెన్‌ పకోడీ, ఉడకబెట్టిన గుడ్లను పంపిణీ చేశారు.

ఉచితంగా చికెన్‌ పకోడీ, ఉడకబెట్టిన గుడ్లు
చికెన్‌ పకోడీ, ఉడకబెట్టి గుడ్లను పంపిణీ చేస్తున్న దుకాణ సిబ్బంది

ఎమ్మిగనూరులో ఓ కంపెనీ ఆధ్వర్యంలో పంపిణీ

ఎమ్మిగనూరు, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని గూడూరు రోడ్డులో ఉన్న ఓ చికెన్‌ సెంటర్‌ వద్ద వెన్‌కాబ్‌ కంపెనీ డీలర్‌ జహంగీర్‌ ఆదివారం మాంసం ప్రియులకు కంపెనీ ఆధ్వర్యంలో ఉచితంగా చికెన్‌ పకోడీ, ఉడకబెట్టిన గుడ్లను పంపిణీ చేశారు. కోళ్లకు వైరస్‌ సోకుతున్న నేపథ్యంలో వ్యాపారాలు జరగక యజమానులు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ప్రజలు కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ చికెన్‌ పకోడీ, గుడ్లను ఉచితంగా పంపిణీ చేయడం గమనార్హం. చికెన్‌ తింటే ప్రమాదమని తినడానికి ప్రజలు భయపడుతున్నారని, వారిలో అపోహ తొలగించడానికి ఉచితంగా పంపిణీ చేశామని డీలర్‌ చెప్పారు. వెన్‌కాబ్‌ కంపెనీ ఆధ్వర్యంలో 500 కేజీల చికెన్‌ పకోడీ, సుమారు 3వేల ఉడకబెట్టిన గుడ్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఒక్కొక్కరికి రెండు గుడ్లు, 200 గ్రాముల చికెన్‌ పకోడీ పంపిణీ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో కంపెనీ మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌ నరేంద్ర రెడ్డి ఉన్నారు.

Updated Date - Feb 24 , 2025 | 12:13 AM