Share News

ఐదు దశాబ్దాల స్నేహం

ABN , Publish Date - Feb 03 , 2025 | 12:01 AM

పత్తికొండ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మొదటి బ్యాచ్‌ (1971-73) విద్యార్థులు ఆదివారం కలిశారు

ఐదు దశాబ్దాల స్నేహం
1971-73 ఇంటర్‌ విద్యార్థులు

1971-73 ఇంటర్మీడియట్‌ విద్యార్థుల కలయిక

పత్తికొండ, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): పత్తికొండ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మొదటి బ్యాచ్‌ (1971-73) విద్యార్థులు ఆదివారం కలిశారు. ఈ కార్యక్రమాన్ని విశ్రాంత మలేరియా అధికారి జయరాం ఆద్వర్యంలో నిర్వహించారు. 1971లో ఏర్పాటైన ఈ కళాశాలలో చదువుకొని వివిధ రంగాల్లో స్థిరపడిన వారు 52ఏళ్ల తర్వాత కళాశాలలో తిరిగి కలుసుకున్నారు. అలనాటి స్నేహితులను చూసి మైమరచి పోయారు. కళాశాల ప్రాంగణమంతా కలియతిరిగారు. తాము చదువుకున్న రోజుల్లోని సంగతులను గుర్తు చేసుకొని ఆనందించారు.

Updated Date - Feb 03 , 2025 | 12:01 AM