భూసార పరీక్ష కేంద్రంలో అగ్ని ప్రమాదం
ABN , Publish Date - Jan 23 , 2025 | 12:42 AM
ఎమ్మిగనూరు పట్టణ శివారులోని ముగతి వ్యవసాయ క్షేత్రంలో ఉన్న భూసార పరీక్ష కేంద్రంలో బుధవారం ఉదయం విద్యుత షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం చోటు చేసుకుంది.
కాలి బూడిదైన పరికరాలు
ఎమ్మిగనూరు, జనవరి 22(ఆంధ్రజ్యోతి): ఎమ్మిగనూరు పట్టణ శివారులోని ముగతి వ్యవసాయ క్షేత్రంలో ఉన్న భూసార పరీక్ష కేంద్రంలో బుధవారం ఉదయం విద్యుత షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం చోటు చేసుకుంది. స్ధానిక అధికారులు తెలిపిన సమాచా రం మేరకు.. రోజు మాదిరిగానే బుధవారం భూసార పరీక్ష కేంద్రా నికి విధులకు హాజరయ్యిందుకు వచ్చిన సిబ్బంది కేంద్రంలో అప్ప టికే మంటలు చెలరేగి ఉండటం చూసి ఉన్నతాధికారులకు సమాచా రం ఇచ్చారు. అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు. అగ్ని మాపక సిబ్బంది హూటాహూటిన సంఘటన స్ధలానికి చేరుకోని మంటలను ఆర్పివేశారు. కాగా అప్పటికే కేంద్రంలోని విద్యుత మీటర్ వైరింగ్ పూర్తిగా కాలిపోయింది. అలాగే కేంద్రంలో ఉన్న కొన్ని పరికరాలతో పాటు పోగా మిషన కూడా కాలిపోయింది. అయితే కేంద్రంలోని ల్యాబ్‌తో పాటు విలువైన యంత్రాలు ఉన్న గదుల్లోకి మంటలు ప్యాపించకపోవటంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయ్యింది. భూ సార పరీక్ష కేంద్రానికి వివిధ గ్రామాల నుంచి తెచ్చిన నమూన మట్టి కాస్త తడిసి పూర్తిగా పాడైపోయాయి. సమాచారం అందుకున్న స్ధానిక ఏవో మురళి కేంద్రాన్ని పరిశీలించి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు.