Share News

ప్రాంతీయ శిక్షణ కేంద్రంలో అగ్ని ప్రమాదం

ABN , Publish Date - Feb 13 , 2025 | 11:24 PM

డీఎంహెచ్‌వో కార్యాలయ ఆవరణలోని ప్రాంతీయ శిక్షణ కేంద్రం(పురుషులు)లో గురువారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం జరిగింది. వైద్య ఆరోగ్యశాఖకు చెందిన కాలం చెల్లిన 3 వాహనాలు, ఒక అంబులెన్స్‌ పూర్తిగా కాలిపో యాయి.

ప్రాంతీయ శిక్షణ  కేంద్రంలో అగ్ని ప్రమాదం
మంటలను ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది

కర్నూలు హాస్పిటల్‌, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): డీఎంహెచ్‌వో కార్యాలయ ఆవరణలోని ప్రాంతీయ శిక్షణ కేంద్రం(పురుషులు)లో గురువారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం జరిగింది. వైద్య ఆరోగ్యశాఖకు చెందిన కాలం చెల్లిన 3 వాహనాలు, ఒక అంబులెన్స్‌ పూర్తిగా కాలిపో యాయి. 2018లో ఇమ్యూనైజేషన్‌ కార్యాలయ భవనంలో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు వాహనాలను ప్రాంతీయ శిక్షణ కేంద్రానికి తరలించారు. గతంలో కాలపరిమితి దాటిన వాహనాలు, వేలం వేసిన వాహనాలు కూడా ఇందులో కాలిపోవడం విశేషం. మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో డీఎంహెచ్‌వో కార్యాలయం ఆవరణలో దట్టమైన పొగలు వ్యాపించడంతో ప్రజలు భారీగా ఇక్కడికి తరలివచ్చారు. ప్రాంతీయ శిక్షణ కేంద్రం(పురుషులు) ఎదురుగా ఉన్న ఖాళీ స్థలాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిసు ్తన్నాయి. ఫిమేల్‌ ట్రైనింగ్‌ సెంటరులో ఓ వ్యక్తి సిగరెట్‌ కాల్చి దాన్ని మేల్‌ ట్రైనింగ్‌ సెంటరులో వేయడం వల్ల అగ్ని ప్రమాదం జరిగిందని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. అగ్ని ప్రమాదంపై డీఎంహెచ్‌వో డా.పి. శాంతికళ, త్రీటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌, వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ అధికారికి ఫిర్యాదు చేశారు. మంటలను అగ్ని ప్రమాపక సిబ్బంది ఆర్పివేశారు.

Updated Date - Feb 13 , 2025 | 11:24 PM