ప్రజా సమస్యలపై పోరాటం
ABN , Publish Date - Jun 04 , 2025 | 12:02 AM
ప్రజా సమస్యలపై పోరాడతామని వైసీపీ నందికొట్కూరు సమన్వయకర్త ధార సుధీర్ అన్నారు.
మిడుతూరు, జూన్ 3(ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యలపై పోరాడతామని వైసీపీ నందికొట్కూరు సమన్వయకర్త ధార సుధీర్ అన్నారు. మిడుతూరులో మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ చిన్న మల్లారెడ్డి నివాసంలో మంగళవారం మండలంలోని వైసీపీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిఽథిగా హాజరైన సుధీర్ మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను విస్మరించి పేదలకు కూటమి ప్రభుత్వం అన్యాయం చేసిందని విమర్శించారు. నందికొట్కూరులో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా బుధవారం జరగే వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్ లోకేశ్వర రెడ్డి, నాయకులు నాగిరెడ్డి, శంకర్ రెడ్డి, గోపాల్ రెడ్డి, స్వామి రెడ్డి, జగన్‌మోహన్ రెడ్డి, వెంకటేశ్వర్లు, రవికుమార్, సుధీర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.