పడిపోయిన జొన్నల ధర
ABN , Publish Date - Feb 16 , 2025 | 11:42 PM
: మండలం లో రబీ సీజనలో 1000 ఎకరాల్లో జొన్న సాగు చేశా రు. ఇందులో పచ్చజొన్న, తెల్లజొన్న రెండు రకాలు ఉన్నాయి. దిగుబడి బాగా వచ్చినా తీర పంట చేతికి వచ్చేసరికి ధర పాతాళానికి పడిపోయింది. దీంతో ఏమి చేయాలో అర్థంకాక రైతులు దిగాలు చెందుతున్నారు.
క్వింటం రూ.3 వేలే..
ఆందోళన చెందుతున్న అన్నదాతలు
మద్దికెర, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): మండలం లో రబీ సీజనలో 1000 ఎకరాల్లో జొన్న సాగు చేశా రు. ఇందులో పచ్చజొన్న, తెల్లజొన్న రెండు రకాలు ఉన్నాయి. దిగుబడి బాగా వచ్చినా తీర పంట చేతికి వచ్చేసరికి ధర పాతాళానికి పడిపోయింది. దీంతో ఏమి చేయాలో అర్థంకాక రైతులు దిగాలు చెందుతున్నారు.
ఎకరాకు రూ.20వేల పెట్టుబడి
జొన్న సాగుకు రైతులు ఎకరాకు రూ.20వేల వరకు పెట్టుబడి పెట్టాడు. కాగా కౌలు రైతుకు పెట్టుబడి ఖర్చు మరింతతా అవుతుంది. అయితే ధరలు తగ్గిపోవడంతో రైతుకు నష్టం వస్తోంది.
పడిపోయిన ధర
జొన్నల ధరలు పడిపోయాయి. క్వింటానికి రూ.6 వేలు ధర వస్తే రైతుకు మేలు. ప్రస్తుతం క్వింటం రూ.3వేలకు పడిపోవడంతో రైతులు ఆందో ళన చెందుతున్నారు. ఈ ప్రాంతంలో మార్కెట్ యార్డు లేకపోవడంతో విక్రయించడానికి దూర ప్రాం తాలకు వెళ్లలేక రైతులు ఇబ్బంది పడుతున్నారు. వ్యాపారులు క్వింటానికి 3 నుంచి 4 కిలోల వరకు తరుగు తీస్తుండటంతో రైతులు నష్టపోతున్నారు.
తీవ్రంగా నష్టపోతున్న రైతులు
ప్రభుత్వం గిట్టుబాటు ధరను కల్పించకపోవ డంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. దూర ప్రాంతాలకు తరలించాలంటే రవాణా ఖర్చు తడిసి మోపెడవుతోందని రైతులు అంటున్నారు.
నష్టం వచ్చింది
మూడెకరాల్లో జొన్న చేశాను. 4 నుంచి 5 క్విం టాళ్ల దిగుబడి వచ్చింది. అయితే ధర సగానికి పడి పోవడంతో పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. మొన్నటివరకు రూ.6వేలు ఉన్న ధర నేడు రూ.3 వేలకు పడిపోయింది. - రామూ యాదవ్, పెరవలి
ఈ విషయమై ఏవో రవిని వివరణ కోరగా జొన్నల కొనుగోలుకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రాలేదని, వస్తే కొనుగోలు చేస్తామన్నారు.