Share News

పత్తి ధర పతనం

ABN , Publish Date - Jan 30 , 2025 | 11:24 PM

ఆదోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులో గురువారం పత్తిధర మరింత పతనమైంది. పత్తి ధర గరిష్ఠంగా క్వింటా రూ.7,350 పలికింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర కంటే క్వింటాకు రూ.200 పైగా ధర తగ్గింది.

పత్తి ధర పతనం
విక్రయానికి వచ్చిన పత్తి దిగుబడులు

ఆదోని అగ్రికల్చర్‌, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): ఆదోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులో గురువారం పత్తిధర మరింత పతనమైంది. పత్తి ధర గరిష్ఠంగా క్వింటా రూ.7,350 పలికింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర కంటే క్వింటాకు రూ.200 పైగా ధర తగ్గింది. రోజు రోజుకూ పత్తి ధరలు తగ్గుతుండడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో పత్తి గింజల ధరలు, దూది ధర తగ్గడం వల్ల స్థానిక మార్కెట్‌లో పత్తి ధరపై ప్రభావం చూపిందని పత్తి వ్యాపారులు తెలిపారు. 1352 క్వింటాళ్ల పత్త విక్రయానికి రాగా వాటి కనిష్ఠ ధర రూ. 4106, గరిష్ఠ రూ. 7350 మద్యధర రూ. 7181 పలికింది.

Updated Date - Jan 30 , 2025 | 11:25 PM