కళ్లను సంరక్షించుకోవాలి: మంత్రి
ABN , Publish Date - Feb 15 , 2025 | 12:07 AM
విద్యార్థులు ట్యాబ్‌లు, సెల్‌ఫోన్లను అధికంగా వినియోగించి కంటి చూపునకు దూరమవుతున్నారని, ఆటపాటలు, చదువు మీద ఏకాగ్రతతో చూపును సంరక్షించుకోవాలని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ సూచిం చారు.

నంద్యాల నూనెపల్లె, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులు ట్యాబ్‌లు, సెల్‌ఫోన్లను అధికంగా వినియోగించి కంటి చూపునకు దూరమవుతున్నారని, ఆటపాటలు, చదువు మీద ఏకాగ్రతతో చూపును సంరక్షించుకోవాలని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ సూచిం చారు. నంద్యాల క్రాంతినగర్ మోడల్ స్కూల్‌లో శుక్రవారం కంటి అద్దాల పంపిణీ నిర్వహించారు. మంత్రితో పాటు కలెక్టర్ రాజకుమారి, డీఎంహెచ్‌వో డా.వెంకటరమణ, డా.మాధవీలత, జిల్లా అంధత్వ నివారణ అధికారి డా.సిసిలియా హాజరయ్యారు. మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 19.60 లక్షల మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించన్నుట్లు తెలిపారు. సమస్యలున్న వారికి ప్రభుత్వం కళ్లద్దాలు పంపిణీ చేస్తోందన్నారు. 90వేలమంది విద్యార్థులకు కళ్లద్దాలు ఇవ్వాలని వైద్యులు సూచించారని, అందుకు ప్రభుత్వం రూ.2.5 కోట్లు వెచ్చించి విద్యార్థులకు అద్దాలను ఉచితంగా పంపిణీ చేస్తోందన్నారు. కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ విద్యార్థులు కళ్లను జాగ్రత్తగా కాపాడుకోవాలని ఫాస్ట్‌ఫుడ్‌కు అలవాటు పడకుండా ఎ-విటమిన్ గల ఆహార పదార్థాలు తీసుకోవాలని సూచించారు. ఏపీ మోడల్ స్కూల్‌లో కంటి సమస్యలున్న 44మంది విద్యార్థులకు మంత్రి ఫరూక్, కలెక్టర్‌లు కళ్లద్దాలను పంపిణీ చేశారు. ఉపాధ్యా యులు పాల్గొన్నారు.