Share News

బీపీఎస్‌ గడువు పెంపు

ABN , Publish Date - Jan 26 , 2025 | 12:06 AM

బీపీఎస్‌ గడువు పెంపు

బీపీఎస్‌ గడువు పెంపు

దరఖాస్తులు త్వరితగతిన పూర్తి చేస్తున్న అఽధికారులు

కర్నూలు న్యూసిటీ, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం ఏర్పాట య్యాక పట్టణ ప్రణాళికా విభాగంలో నూతన సంస్కరణలను తీసుకువచ్చింది. ఎప్పుడో 2022 సం వత్సరంలో బీపీఎస్‌(బిల్డింగ్‌ పీనలైజేషన్‌ స్కీం) అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణను మళ్లీ కూటమి ప్రభుత్వం తీసుకు వచ్చింది. దరఖాస్తుదారులు ఈ స్కీమ్‌లో పనులు చేయించుకో వాలంటే మార్చి 31 వరకు గడువు పొడిగిస్తూ గత నెల డిసెంబ రులో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నగర పాలక సంస్థ పరిధిలోని 52 వార్డులలో ఇప్పటి వరకు అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణ కోసం 262 దరఖాస్తులు వచ్చాయి. అయితే అందులో 33 దరఖాస్తులను 2022 సంవత్సరంలోనే అనుమతులు ఇచ్చారు. మిగిలిన 202 దరఖాస్తులకు వివిధ రకాల పత్రాలు ఇవ్వాలని చూపుతూ ఎండా ర్స్‌మెంట్‌ ఇచ్చారు. అదేవిధంగా 14 దరఖాస్తుదా రులకు డబ్బులు చెల్లించాలని నోటీసులు జారీ చేశారు. ఈ ప్రక్రియలను వేగవంతం చేసేందుకు అధి కారులు సమాయత్తం అయ్యారు. అందులో భాగంగా ప్లానింగ్‌ సెక్ర టరీలతో పెండింగ్‌ దరఖాస్తులకుదారులకు ఫోన్లు చేయిస్తున్నారు.

ఎల్‌ఆర్‌ఎస్‌ గడువు పెంపు..

లేఅవుుట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీం కూడా గడువు పెంచుతూ కూట మి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత నెల 9న ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 31 లోపల అక్రమ లేఅవుట్‌లను క్రమబద్ధీకరించుకో వాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పట్టణ ప్రణాళికా అధికారులు దీని కోసం ప్రణాళికలు సిద్ధం చేయడంతోపాటు పెండింగ్‌ దరఖాస్తుల ను పూర్తి చేసేందుకు పనులు వేగవంతం చేశారు. ఇప్పటి వరకు 619 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 279 దరఖాస్తులకు అనుమ తులు ఇచ్చారు. 100 దరఖాస్తులకు వివిధ రకాల పత్రాలు పెండిం గ్‌ ఉన్నాయంటూ అధికారులు షార్ట్‌ఫాల్స్‌లో ఉంచారు. 26 మంది దరఖాస్తుదారులు డబ్బులు చెల్లించాలని పరిశీలనలో ఉంది. మిగిలి న 77 దరఖాస్తులు ప్రాసెస్‌లో ఉన్నాయి. పెండింగ్‌ దరఖాస్తుదారు లకు ప్లానింగ్‌ సెక్రటరీలో సంప్రదిస్తున్నారు.

Updated Date - Jan 26 , 2025 | 12:06 AM