Share News

మద్దతు ధరను మించి..!

ABN , Publish Date - Jan 16 , 2025 | 11:41 PM

ఆదోని వ్యవసాయ మార్కెట్‌ యార్డ్‌లో పత్తి ధరలు మళ్లీ పుంజుకుంటున్నాయి.

మద్దతు ధరను మించి..!
విక్రయానికి వచ్చిన పత్తి దిగుబడులు

పుంజుకున్న పత్తి.. క్వింటం రూ.7,632

ఆదోని అగ్రికల్చర్‌, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): ఆదోని వ్యవసాయ మార్కెట్‌ యార్డ్‌లో పత్తి ధరలు మళ్లీ పుంజుకుంటున్నాయి. గురువారం పత్తి ధర క్వింటా గరిష్టంగా రూ.7,632 పలికింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరకు మించి క్వింటాకు రూ.100పైగా ధర పెరిగింది. పత్తి ధరలు పెరుగుతుం డడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో దూది, పత్తి గింజల ధరలు పెరగడంతో స్థానిక పరిశ్రమలకు చెందిన పత్తి వ్యాపారులు పోటీపడి టెండర్లు దాఖలు చేసి కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఆదోని మార్కెట్‌లో పత్తి నిల్వలు వేగంగా అమ్మకాలు జరుగుతున్నాయి. గురువారం 1,785 క్వింటాళ్ల పత్తి విక్రయానికి రాగా వాటి కనిష్ఠ ధర రూ.5,580, గరిష్ఠ ధర రూ.7,632, మధ్యస్థంగా ధర రూ.7,389 పలికింది.

Updated Date - Jan 16 , 2025 | 11:41 PM