‘ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భావన పెంచుకోవాలి’
ABN , Publish Date - Jun 05 , 2025 | 12:43 AM
ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భావన పెంచుకోవాలని జగద్గురు చంద్రశేఖర్‌రెడ్డి సూచించారు.
మహానంది, జూన్ 4 (ఆంధ్రజ్యోతి): ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భావన పెంచుకోవాలని జగద్గురు చంద్రశేఖర్‌రెడ్డి సూచించారు. కర్నూలులోని సద్గురు దత్త కృపాలయం ట్రస్ట్ నిర్వాహకులు, ఆధ్యాత్మిక గురువు చంద్రశేఖర్‌రెడ్డి, కృష్ణకుమారి దంపతులు బుధవారం మహానందిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరికి ఆలయం వద్ద పర్యవేక్షకుడు శశిధర్‌రెడ్డి ఆధ్వర్యంలో అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం ప్రధాన ఆలయాల్లో స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు వేద పండితులు స్వామివారి ప్రసాదాలు అందజేశారు. టీడీపీ మండల కన్వీనర్ శివశంకర్ చౌదరి, నాగపుల్లయ్య, హరిబాబుచౌదరి పాల్గొన్నారు.