Share News

అదానితో విద్యుత్‌ ఒప్పందాలు రద్దు చేయాలి

ABN , Publish Date - Jan 30 , 2025 | 11:40 PM

అదానితో ప్రభుత్వం చేసుకున్న విద్యుత్‌ ఒప్పందాలను తక్షణమే రద్దు చేసుకోవాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు, మాజీ ఎమ్యెల్యే గపూర్‌ డిమాండ్‌ చేశారు.

అదానితో విద్యుత్‌ ఒప్పందాలు రద్దు చేయాలి

సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు, మాజీ ఎమ్యెల్యే గపూర్‌

మాట్లాడుతున్న గపూర్‌

నంద్యాల రూరల్‌, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): అదానితో ప్రభుత్వం చేసుకున్న విద్యుత్‌ ఒప్పందాలను తక్షణమే రద్దు చేసుకోవాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు, మాజీ ఎమ్యెల్యే గపూర్‌ డిమాండ్‌ చేశారు. ఫిబ్రవరి 1, 2, 3 తేదీలలో నెల్లూరులో జరుగుతున్న రాష్ట్ర మహాసభలకు బయలుదేరిన జీపు జాతాను నంద్యాల పట్టణం గాంధీచౌక్‌ వద్ద ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్‌ 2020 అంటూ ప్రజలను మోసం చేశారని వ్యాఖ్యానించారు. సూపర్‌సిక్స్‌ పథకాల అమలులో చేతులెత్తేశారని విమర్శించారు. అదానితో చేసుకున్న విద్యుత్‌ ఒప్పందాల వల్ల కరెంట్‌ చార్జీలు పెరుగుతాయని అన్నారు. కాబట్టి ఆ ఒప్పందాలను రద్దు చేసుకోవాలని అన్నారు. జీపు జాతా ప్రారంభంలో జిల్లా కార్యదర్శి రమేష్‌కుమార్‌, కార్యదర్శి వర్గ సభ్యుడు నాగరాజు, జిల్లా కమిటీ సభ్యుడు పుల్లా నరసింహ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 30 , 2025 | 11:40 PM