Share News

పక్కా గృహాల మంజూరుకు కృషి

ABN , Publish Date - Jun 29 , 2025 | 01:01 AM

దివ్యాంగులకు ఇంటి స్థలంతో పాటుగా పక్కా గృహాల మంజూరుకు కృషి చేస్తానని ఎంపీ బైరెడ్డి శబరి అన్నారు.

పక్కా గృహాల మంజూరుకు కృషి
నందికొట్కూరులో మాట్లాడుతున్న ఎంపీ బైరెడ్డి శబరి

నందికొట్కూరు రూరల్‌, జూన్‌ 28 (ఆంధ్రజ్యోతి): దివ్యాంగులకు ఇంటి స్థలంతో పాటుగా పక్కా గృహాల మంజూరుకు కృషి చేస్తానని ఎంపీ బైరెడ్డి శబరి అన్నారు. నందికొట్కూరు ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో శనివారం విభిన్న ప్రతిభావంతులకు ఉచితంగా వారి పరికరాలను అందించేందుకు ఎంపిక కోసం ఎంపీడీవో సుబ్రమణ్యశర్మ ఆధ్వర్యంలో సహాయ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు ముఖ్య అథిదిగా విచ్చేసిన ఎంపీ మాట్లాడుతూ నందికొట్కూరు డివిజన్‌ పరిధిలోని విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధులకు మూడు చక్రాల సైకిల్‌, వీల్‌ చైరు, చంక కర్రలు, బ్యాటరీతో నడిచే మూడు చక్రాల సైకిల్‌, శ్రవణ పరికరాలు, అంధుల చేతి కర్రలు అందజేయున్నట్లు తెలిపారు. రెండు సెంట్లు ఇప్పించాలని దివ్యాంగులు ఎంపీని కోరారు. దివ్యాంగులకు రెండు సెంట్లు ఇచ్చేలా చూడాలని తహసీల్దార్‌ శ్రీనివాసు లుకు సూచించారు. ఆర్డీవో నాగజ్యోతి, మున్సిపల్‌ చైర్మన్‌ దాసి సుధాకరెడ్డి, టీడీపీ నాయకులు పల్లె రఘురామిరెడ్డి, మాజీ జడ్పీటీసీ నాగేశ్వరరావు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి చిన్న వెంకటస్వామి పాల్గొన్నారు.

పైపాలెం గ్రామం సందర్శన

మిడుతూరు: మండలంలోని పైపాలెం గ్రామాన్ని ఎంపీ శబరి శనివారం సందర్శించారు. ఎంపీ శబరితో గ్రామస్థులు మాట్లాడుతూ పైపాలెం గ్రామంలో జరుగుతున్న సోలార్‌ పనుల వల్ల తమ పొలాలకు వెళ్లు రహదారులు, నీటికుంటలు, పొలాల గెట్లు తొలగించడం వల్ల తమకు అన్యాయం జరుగుతుందని చెప్పారు. సోలార్‌ పనుల్లో బ్లాసింగ్‌లు చేయడం వల్ల గ్రామంలో ప్రజలు భయబ్రాంతులకు గురిఅవుతున్నారని గ్రామస్తులు తెలిపారు. ఎంపీ స్పందించి సోలార్‌ ఏర్పాటు చేస్తున్న ప్రదేశాన్ని పరిశీలించారు. సోలార్‌ పనుల్లో అనుమతులు లేకుండా ఎలా బ్లాస్టింగ్‌లు చేస్తారని, నిలిపివేయాలని అధికారులకు సూచించారు తహసీల్దార్‌ శ్రీనివాసులు, ఎంపీడీవో దశరథరామయ్య, సర్పంచ్‌ రామచంద్రుడు, టీడీపీ నాయకులు వెంకటస్వామి, నాగేశ్వరరావు, సీతారామి రెడ్డి, అంకిరెడ్డి, స్వామిరెడ్డి, గోకారి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 29 , 2025 | 01:01 AM