Share News

సమస్యల పరిష్కారానికి కృషి: మంత్రి ఫరూక్‌

ABN , Publish Date - Jul 20 , 2025 | 12:09 AM

సమస్యల పరిష్కారానికే ప్రజాదర్బార్‌ నిర్వహిస్తున్నట్లు న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ అన్నారు.

సమస్యల పరిష్కారానికి కృషి: మంత్రి ఫరూక్‌
సమస్యలు తెలుసుకుంటున్న మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌

నంద్యాల రూరల్‌, జూలై 19 (ఆంధ్రజ్యోతి): సమస్యల పరిష్కారానికే ప్రజాదర్బార్‌ నిర్వహిస్తున్నట్లు న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ అన్నారు. పట్టణంలోని టీడీపీ కార్యాల యంలో శనివారం ప్రజాదర్బార్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. నియోజ కవర్గంలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు తమ సమస్యల పరిష్కరించాలని మంత్రికి వినతిపత్రాలు అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ పట్టణాలు, గ్రామాలు నెలకొన్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ ఎంతో విలువైన సేవలను అందిస్తోందన్నారు.

Updated Date - Jul 20 , 2025 | 12:09 AM