ఫిషరీస్ బిజినెస్ హబ్ ఏర్పాటుకు కృషి: ఎమ్యెల్యే బీవీ
ABN , Publish Date - Feb 07 , 2025 | 12:40 AM
గాజులదిన్నె ప్రాజెక్టులో ఫిషరీస్ బిజినెస్ హబ్ ఏర్పాటుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు.

గోనెగండ్ల, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): గాజులదిన్నె ప్రాజెక్టులో ఫిషరీస్ బిజినెస్ హబ్ ఏర్పాటుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు. గురువారం గాజులదిన్నె ప్రాజెక్టులో అవగాహన సమావేశం నిర్వహించారు. మత్స్యశాఖ డీడీ శ్యామల, జీడీపీ డీఈ విజయ్‌కుమార్ హాజరయ్యారు. అంతకు ముందు బోటులో నాయకులు, అధికారులు గాజులదిన్నె ప్రాజెక్టును సందర్శిం చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీవీ మాట్లాడుతూ గాజులదిన్నె ప్రాజెక్టు మత్స్య క్షేత్రంలో 350 మంది మత్స్యకారులు ఉన్నారన్నారు. మత్స్యకార్మికులు కష్టపడి మత్స్య సంపదను మరింత పెంచాలన్నారు. ప్రభుత్వం అందించే సబ్సిడీ రుణాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇక్కడే ఫిషరిష్ బిజినెస్ హబ్ ఏర్పాటు చేస్తే కార్మికులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. మత్స్యకార్మికుల సమస్యలు పరిష్క రించేందుకు గాను తన వంతు సహకారం అందిస్తామని చెప్పారు. కార్యక్రమంలో తహసీల్దార్ కుమారస్వామి, ఎంపీడీవో మణిమంజరి, మత్స్యకారసంఘం గౌరవ అధ్యక్షుడు మాజీ ఎంపీపీ హనుమంతు, మత్స్యకార సంఘం అధ్యక్షుడు రంగస్వామినాయుడు, స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు.