Share News

శ్రీశైలం అభివృద్ధికి కృషి చేయాలి

ABN , Publish Date - May 11 , 2025 | 12:17 AM

శ్రీశైల నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ను కోరారు.

శ్రీశైలం అభివృద్ధికి కృషి చేయాలి
మంత్రి ఫరూక్‌తో చర్చిస్తున్న ఎమ్మెల్యే బుడ్డా

నంద్యాల రూరల్‌, మే 10 (ఆంధ్రజ్యోతి): శ్రీశైల నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ను కోరారు. శనివారం నంద్యాలలోని టీడీపీ కార్యాలయంలో ఆయన మంత్రిని మర్యాద పూర్వకంగా కలిశారు. శీశైలం నియోజకవర్గంలో చేపట్టిన, చేపట్టాల్సిన అభివృద్ధి పనుల గురించి మంత్రికి వివరించారు. తెలుగుగంగ ప్రాజెక్ట్‌ చైర్మన్‌ రామలింగారెడ్డి, మార్క్‌ఫెడ్‌ డైరెక్టర్‌ తులసిరెడ్డి తదితరులు ఉన్నారు.

Updated Date - May 11 , 2025 | 12:17 AM