Share News

అభివృద్ధికి కృషి చేయాలి

ABN , Publish Date - Oct 22 , 2025 | 11:48 PM

కోసిగి మండల అభివృద్ధికి అధికారులు, నాయకులు అందరూ కలిసికట్టుగా పని చేస్తేనే అభివృద్దికి సాధ్యమవుతుందని తహసీల్దార్‌ ఎ.వేణుగోపాల్‌ అన్నారు.

అభివృద్ధికి కృషి చేయాలి
మాట్లాడుతున్న తహసీల్దార్‌ వేణుగోపాల్‌

కోసిగి, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): కోసిగి మండల అభివృద్ధికి అధికారులు, నాయకులు అందరూ కలిసికట్టుగా పని చేస్తేనే అభివృద్దికి సాధ్యమవుతుందని తహసీల్దార్‌ ఎ.వేణుగోపాల్‌ అన్నారు. బుధవారం కోసిగిలోని ఎంపీడీవో కార్యాలయంలో ఇన్‌చార్జి ఎంపీడీవో ఈశ్వరయ్య స్వామి ఆధ్వర్యంలో ఎంపీపీ పెండేకల్లు ఈరన్న అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. మండల అభివృద్దిపై ఎంపీటీసీ, సర్పంచులతో పలు శాఖల అధికారులు చర్చించారు. ముఖ్యంగా వలసలు నివారించి విద్యార్థులను వలస వెళ్లకుండా చూడాలని ప్రజా ప్రతినిధులు అధికారులకు తెలియజేశారు. మండలంలో అత్యధికంగా వలసలు వెళ్తున్నారనీ, గ్రామాలు ఖాళీ అవుతున్నాయన్నారు. సింగిల్‌ విండో అద్యక్షులు నాడిగేని అయ్యన్న, మార్కెట్‌ యార్డు చైర్మన్‌ చింతలగేని నర్సారెడ్డి, వ్యవసాయాధికారి వరప్రసాద్‌, ఏపీవో ఖాళిక్‌, ఎంఈవో బాలయ్య, మాలిక్‌, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్లు భాగ్యలక్ష్మి, కాత్యాయని, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

Updated Date - Oct 22 , 2025 | 11:48 PM