ఆర్జిత సెలవులు ఇవ్వాలి: పీఆర్‌టీయూ
ABN , Publish Date - May 03 , 2025 | 11:20 PM
ప్రభుత్వ ఉపాధ్యాయులను ఇతర ఉద్యోగుల మాదిరిగానే నాన్ వెకేషన్ డిపార్ట్‌మెంట్‌గా పరిగణించి 30 ఆర్జిత సెలవులు ఇవ్వాలని పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు రామఫక్కీరెడ్డి డిమాండ్ చేశారు.
నంద్యాల ఎడ్యుకేషన్, మే 3 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉపాధ్యాయులను ఇతర ఉద్యోగుల మాదిరిగానే నాన్ వెకేషన్ డిపార్ట్‌మెంట్‌గా పరిగణించి 30 ఆర్జిత సెలవులు ఇవ్వాలని పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు రామఫక్కీరెడ్డి డిమాండ్ చేశారు. వారు మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా వేసవి సెలవుల్లో ఫెయిల్ అయిన పదో తరగతి విద్యా ర్థులకు రెమిడీయల్ తరగతులు, శిక్షణా తరగతులు నిర్వహిస్తు న్నారని చెప్పారు. రకరకాల ఆన్‌లైన్ క్లాసులు పూర్తి చేయాలని, లేకపోతే వేత నాలు నిలిపివేస్తూ ఒత్తిళ్లకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.