విధులు సక్రమంగా నిర్వర్తించాలి
ABN , Publish Date - Jun 19 , 2025 | 12:07 AM
శ్రీశైల దేవస్థానంలో పనిచేసే ఉద్యోగులు విధులు సక్రమంగా నిర్వర్తించాలని శ్రీశైలం దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు ఆదేశించారు.
నంద్యాల కల్చరల్(శ్రీశైలం), జూన్ 18(ఆంధ్రజ్యోతి): శ్రీశైల దేవస్థానంలో పనిచేసే ఉద్యోగులు విధులు సక్రమంగా నిర్వర్తించాలని శ్రీశైలం దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు ఆదేశించారు. శ్రీశైలంలో పరిపాలనాంశాల పరిశీలనలో భాగంగా బుధవారం శ్రీశైల క్షేత్ర సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈవో మాట్లాడుతూ అన్ని విభాగాల ఉద్యోగులు కూడా పరస్పర సమన్వయంతో విధులు ని ర్వర్తించాలన్నారు. అన్నప్రసాదవితరణలో ఆయా వంటకాలన్నీ రుచి కరంగా ఉండేవిధంగా అన్నప్రసాద సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. క్యూలైన్‌లు పటిష్టంగా ఉండాలన్నారు. క్యూ కాంప్లెక్స్ లో భక్తులకు నిరంతరం తాగునీరు, బిస్కెట్లు, అల్పాహారం అందిస్తూ మరింత మంది శివసేకులను, సెక్యూరిటీ సిబ్బంది ఏర్పాటు చేసుకోవాలన్నారు. అలాగే దివ్యాంగుల సౌకర్యార్ధం విరాళాల కేంద్రం వద్ద మరిన్ని చక్రాల కుర్చీలను అందుబాటులో వుంచాలన్నారు. సిబ్బంది అందరూ భక్తుల పట్ల మర్యాదగా మెలగాలన్నారు.