దుమ్ము పడుద్ది?
ABN , Publish Date - Feb 24 , 2025 | 12:19 AM
జాతీయ రహదారి పనులు ఆగిపోవడంతో దమ్ము రేగుతోంది. దీంతో వాహనదారులు, చుట్టూ ఉన్న దుకాణాల వ్యాపారులు అవస్థలు పడుతున్నారు.

అధ్వానంగా ఆలూరు-ఆదోని రహదారి
ఇప్పటికే పలుమార్లు స్థానికుల నిరసన
ఆలూరు, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): జాతీయ రహదారి పనులు ఆగిపోవడంతో దమ్ము రేగుతోంది. దీంతో వాహనదారులు, చుట్టూ ఉన్న దుకాణాల వ్యాపారులు అవస్థలు పడుతున్నారు. ఆలూరు-ఆదోని ప్రధాన మార్గంలో నాలుగేళ్లుగా పనులు కొన్నిచోట్ల సంపూర్తి చేయలేదు. ఇప్పటికే పలు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఇటీవల స్థానికులు, ప్రజాసంఘాల నాయకులు రహదారిపై బైఠాయించడంతో ఆలూరు ఎస్సై దిలీప్ కుమార్ జోక్యం చేసుకుని ఆర్‌అండ్‌బీ అదికారులతో మాట్లాడి 20 రోజుల్లో రహదారి పనులు ఆరంభించేలా చూస్తానని హామీ ఇచ్చి ఆందోళన విరమింపజేశారు. అలాగే మూడు రోజుల క్రితం ఆలూరుకు వచ్చిన పత్తిపాడు ఎమ్మెల్యే రామంజినేయులు దృష్టికి టీడీపీ ఇన్‌చార్జి వీరభద్ర గౌడ్ తీసుకెళ్లగా ఆయన నేషనల్ హైవే రాష్ట్ర డిప్యూటీ కమిషనర్ మురళీతో చర్చించారు. జిల్లా జాతీయ రహదారి ఈఈ శంకర్ రెడ్డి, డీఈ సుధాకర్‌ను వెంటనే పనులు ప్రారంభిచాలని ఆదేశించారు. అలాగే రెండు రోజుల క్రితం టీడీపీ ఇన్‌చార్జి వీరభద్ర గౌడ్‌తో అధికారులతో కలిసి జాతీయ రహదారిని పరిశీలించారు.